హోమ్ /వార్తలు /బిజినెస్ /

PhonePe Insurance: ఫోన్‌పే ఇన్స్యూరెన్స్... ప్రీమియం ఏడాదికి రూ.4,426 నుంచి

PhonePe Insurance: ఫోన్‌పే ఇన్స్యూరెన్స్... ప్రీమియం ఏడాదికి రూ.4,426 నుంచి

PhonePe Insurance | మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ (Max Life Smart Secure Plus Plan) తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ ప్లాన్ ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

PhonePe Insurance | మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ (Max Life Smart Secure Plus Plan) తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ ప్లాన్ ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

PhonePe Insurance | మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ (Max Life Smart Secure Plus Plan) తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఈ ప్లాన్ ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

ఫోన్‌పే యాప్‌లో ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫోన్‌పే ద్వారా 'మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్' (Max Life Smart Secure Plus Plan) తీసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌పేతో మ్యాక్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫోన్‌పే ప్లాట్‌ఫామ్‌పై మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ లాంఛ్ చేసింది. ఫోన్‌పే ఇన్స్యూరెన్స్ (PhonePe Insurance) సెక్షన్‌లో కస్టమర్లు నేరుగా మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చు. పాలసీ రెన్యువల్ కూడా చేయొచ్చు. కస్టమర్లు రూ.10 కోట్ల వరకు ప్లాన్ తీసుకోవచ్చు. 18 ఏళ్ల వయస్సు దాటినవారెవరైనా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఫోన్‌పే కస్టమర్లు పూర్తి కవరేజీ ద్వారా తమ కుటుంబానికి రక్షణ ఇవ్వొచ్చని, ప్రీమియం రూ.4,426 నుంచి మొదలవుతుందని కంపెనీ తెలిపింది.

ఫోన్‌పేలో టర్మ్ ప్లాన్ సులువుగా తీసుకోవచ్చని, ఎక్కువగా పేపర్ వర్క్ ఉండదని కంపెనీ వివరించింది. ఫోన్‌పే భారతదేశంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. యాప్ ద్వారా ఇన్స్యూరెన్స్ అమ్మేందుకు ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుంచి డైరెక్ట్ బ్రోకింగ్ లైసెన్స్ కూడా పొందింది.

Post Office Account: పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్

ఫోన్‌పేలో ఇన్స్యూరెన్స్ కేటగిరీలో మ్యాక్స్‌లైఫ్ ఫోన్‌పే కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ అందిస్తుంది. టెర్మినల్ ఇల్‌నెస్ బెనిఫిట్, స్పెషల్ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఎవరి అవసరం లేకుండా ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు స్వయంగా ఫామ్ పూర్తి చేసి టర్మ్ ఇన్స్యూరెన్స్ పొందొచ్చు.

మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్

మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ వివరాలు చూస్తే ఇది సమగ్రమైన లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. 2021 ఏప్రిల్‌లో లాంఛ్ అయింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. ఈ పాలసీ తీసుకున్న పాలసీహోల్డర్లకు అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. ప్రీమియం బ్రేక్ ఆప్షన్, స్పెషల్ ఎగ్జిట్ వ్యూల్యూ, చాయిస్ ఆఫ్ క్లెయిమ్స్ పేఔట్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి.

New Rules: అలర్ట్... ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

కస్టమర్లు స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ ప్లాన్ ఎంచుకుంటే కస్టమర్లు తాము కోరుకున్న సమయంలో ప్రీమియం వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రీమియం చెల్లించే విషయంలో విరామం తీసుకోవచ్చు. కవరేజీ కొనసాగుతుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్‌లో రెండుసార్లు ప్రీమియం బ్రేక్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. ఇక నామినీ క్లెయిమ్స్‌ని పేఔట్ మోడ్ లేదా లంప్‌సమ్, మంత్లీ ఇన్‌కమ్, పార్ట్ లంప్‌సమ్, పార్ట్ మంత్లీ ఇన్‌కమ్ ఆప్షన్స్ ద్వారా ఎంచుకోవచ్చు.

First published:

Tags: Insurance, Life Insurance, Personal Finance, PhonePe

ఉత్తమ కథలు