మన దేశంలోని అనేక ఇన్సూరెన్స్(Insurance) కంపెనీలు వివిధ రకాల పాలసీలను అందిస్తున్నాయి. అయితే గృహిణులకు మాత్రం ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి పాలసీలు లేవు. ప్రస్తుతం భారత్‌లోని గృహిణులకు సంపాదనపరులైన వారి భర్తల ఇన్సూరెన్స్ కవరుకు యాడ్ ఆన్‌గా మాత్రమే టర్మ్ కవరేజ్ అందుబాటులో ఉంది. వీరికోసం ప్రత్యేకంగా కొత్త ఇండివిడ్యువల్ పాలసీలను ప్రకటించింది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ. Max Life Smart Secure Plus Plan పేరుతో ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ గృహిణులకు ఒక ఇండివిడ్యువల్ టర్మ్ ఇన్సూరెన్స్ కవర్‌ను ఈ పేరుతో కంపెనీ అందిస్తోంది.
పాలసీ బజార్ ద్వారా అందిస్తున్న ఈ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ గృహిణులకు భద్రత కల్పించడమే కాదు వారి భర్త జీవిత బీమా కవరేజ్ నుంచి వారిని స్వతంత్రంగా ఉంచుతుంది. ఈ తరహా కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లను చక్కదిద్దేందుకు Max Life, Policybazar కలిసికట్టుగా పనిచేస్తూ ఇంత వరకు ఎవరూ వెళ్లని ఈ సెగ్మెంట్‌లోకి చొచ్చుకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఆర్థిక రక్షణను మరింత అందుబాటును పెంచేందుకు ఈ సెక్యూర్ ప్లాన్స్ వార్షిక ఆదాయం కనీసం రూ.5 లక్షల ఉన్నవారికి కూడా అందుబాటులో ఉన్నాయి. 18 నుంచి 50 సంవత్సరాల్లోపు గృహిణులకు మొర్టాలిటీ, రైడర్ ప్రయోజనాలతో కూడిన వేర్వేరు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
“గృహిణిగా ఒక మహిళ అందించే సహకారం చాలా ముఖ్యమైనది, దాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కుటుంబ బాగోగులు చూసుకోవడంతో పాటు భావోద్వేగపరమైన చేయూత అందిస్తూ కుటుంబం తగిన ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కలిగి ఉండేలా చూస్తారు. గృహిణుల కోసం ఉద్దేశించిన Max Life Smart Secure Plus Plan భారతీయ మహిళలకు సాధికారత కల్పించే చర్యల్లో మరో ముందడుగు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో వారికి రక్షణ కల్పిస్తూ ఆర్థిక సమిష్ఠితత్వాన్ని ఇది అందిస్తుంది” అని అన్నారు Max Life డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ వి.విశ్వనాధ్.
“ప్రస్తుత ఆన్‌లైన్ సంరక్షణ శ్రేణిలో గృహిణుల సెగ్మెంట్‌ను ఇంత వరకు ఎవరు ముట్టలేదు. భారతీయులపరంగా చూస్తే ఈ సెగ్మెంట్ ఎప్పటికీ ఒక విస్తృత విభాగంగా కొనసాగుతుంది” అన్నారు Policybazaar.com సీఈఓ సర్బవీర్ సింగ్.
పాలసీ ప్రత్యేకతలు
రెండు మరణ ప్రయోజనాలు అందించడం ఈ టర్మ్ ప్లాన్ ప్రత్యేకత. తీవ్రమైన వ్యాధులకు రక్షణ, ప్రత్యేక ఎగ్జిట్ వ్యాల్యూ వంటి ఇన్ బిల్ట్ ప్రయోజనాలను కూడా పాలసీదారులు పొందుతారు. వీటితో పాటు జాయింట్ లైఫ్ కవర్, ప్రీమియం బ్రేక్స్, ప్రమాద మరణాలకు అదనపు చెల్లింపు సహ ఇలాంటి ఎన్నో ఆప్షనల్ ప్రయోజనాలను ఈ సెక్యూర్ ప్లస్ ప్లాన్ అందిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ పాలసీ కొనుగోలు చేసే వ్యక్తి పాలసీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం, మీ ఆర్థిక నిర్ణయాల గురించి పూర్తిగా తెలుసుకొని ఉండటం చాలా ముఖ్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Insurance, Insurance