MAX LIFE LAUNCH OF MAX LIFE SUSTAINABLE EQUITY FUND OPPORTUNITY TO INVEST IN COMPANIES WITH TOP ESG SCORE GH VB
Max Life: మాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈక్విటీ ఫండ్ లాంచ్.. ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓ సరికొత్త ఈక్విటీ ఫండ్‌ను లాంచ్ చేసింది. మాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈక్విటీ ఫండ్(Max Life Sustainable Equity Fund)ను లాంచ్ చేసింది. ఎన్విరాన్మెంటల్ (Environmental), సోషల్(Social), గవర్నెన్స్(Governance) అంశాలపై దృష్టి సారించే కంపెనీలలో పెట్టుబడులు పెట్టనుంది.
మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓ సరికొత్త ఈక్విటీ ఫండ్‌ను లాంచ్ చేసింది. మాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈక్విటీ ఫండ్(Max Life Sustainable Equity Fund)ను లాంచ్ చేసింది. ఎన్విరాన్మెంటల్ (Environmental), సోషల్(Social), గవర్నెన్స్(Governance) అంశాలపై దృష్టి సారించే కంపెనీలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్యూర్ ఈక్విటీ ESG ఫండ్‌ను తీసుకొచ్చినట్లు మ్యాక్స్ లైఫ్(Max life) ఇన్సూరెన్స్ కంపెనీ(Insurance Company) పేర్కొంది. పెట్టుబడులకు బాధ్యతను జోడిస్తూ, విలువలకు కట్టుబడి సంపదను సృష్టించుకొనేందుకు అవకాశం కల్పిస్తూ ఈ ఫండ్‌ను లాంచ్(Launch) చేసింది. చాలా మంది వ్యక్తులు ప్రపంచాన్ని నివసించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చడానికి వారు విశ్వసించే కొన్ని ప్రధాన విలువలకు కట్టుబడి సంపదను పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఎన్విరాన్మెంటల్, సోషల్(Social), గవర్నెన్స్‌లో(Governance) పెట్టుబడులు పెట్టడానికి ESG ఇన్వెస్టింగ్ అనేది ఒక అడుగుగా చెప్పవచ్చు.
ESG విధానాన్ని అనుసరించడం ద్వారా, ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. మాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈక్విటీ ఫండ్ బాధ్యతాయుతమైన పెట్టుబడి కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అవకాశంలా మారుతుంది. మెరుగైన ESG స్కోర్లను నిర్వహించే సంస్థలలో పెట్టుబడి పెడుతుంది. నిఫ్టీ ESG 100 ఇండెక్స్‌తో లింక్ అయి, ESG ఇండెక్స్‌లలో భాగమైన స్టాక్‌లపై దృష్టి సారించే ESG సూత్రాలను ప్రోత్సహిస్తుంది, అధిక ESG స్కోర్లు ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది.
నిఫ్టీ 100 ఇండెక్స్‌ను అధిగమించిన నిఫ్టీ ఈఎస్జీ
మాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈక్విటీ ఫండ్ అనేది సదరు సంస్థ సస్టెయినబిలిటీపై పెడుతున్న శ్రద్ధకు అనుగుణంగా ఉంది. సంస్థ ఎక్కువగా బాధ్యతాయుతంగా ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ అంశాలను ప్రోత్సహిస్తూ ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది, తద్వారా ESG-కంప్లైంట్ సంస్థగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. మ్యాక్స్ లైఫ్ సస్టైనబుల్ ఈక్విటీ ఫండ్‌తో, సంస్థ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎఎన్విరాన్మెంటల్, సామాజిక నష్టాలపై మరింత దృష్టి పెడుతుంది.
మార్కెట్ విశ్లేషణ ప్రకారం.. నిఫ్టీ ESG ఇండెక్స్ గత ఐదేళ్లలో నిఫ్టీ 100 ఇండెక్స్‌ను అధిగమించింది. అందువల్ల, గవర్నెన్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంట్పై స్పృహ కలిగిన కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని తెలుస్తుంది. దీనిద్వారా దీర్ఘకాలిక వృద్ధి, సంపద సృష్టి కోసం స్థిరమైన నిధులలో పెట్టుబడి పెట్టడం అత్యవసరం. Max Life కి చెందిన ESG ప్రయాణం ఇప్పటికే మొదలైంది. నైతికంగా, స్థిరంగా పని చేయడం, వ్యక్తులు, సమాజంపై శ్రద్ధ, ఆర్థిక బాధ్యత, గ్రీన్ ఆపరేషన్స్ అనే నాలుగు స్తంభాల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.