Gold Price Today: మహిళలకు షాకింగ్​ న్యూస్​​.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరిగాయి.

  • Share this:
    పండుగ సీజన్​ కావడంతో బంగారం (Gold) కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో (gold prices) ఈ రోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధర (gold Price)లో హెచ్చుతగ్గులకు కారణం అయింది. ఇక తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారం ధరపై దాదాపు రూ.250 కు పైగా పెరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర (silver price) మాత్రం స్థిరంగానే ఉన్నా అక్కడక్కడ కొద్దిగా పెరిగాయి. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో..

    హైదరాబాద్‌ (Hyderabad)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విజయవాడ (Vijayawada)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (gold price) రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది.

    దేశంలోని వివిధ నగరాల్లో..

    ఢిల్లీ (Delhi)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది. చెన్నై (Chennai)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,320 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 వద్ద కొనసాగుతోంది.

    కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

    వెండి ధరలు పరిశీలిస్తే..

    వెండి  ధరలు (Silver price) చాలా వరకు స్థిరంగానే ఉన్నా.. అక్కడక్కడ కొద్దిగా పెరిగాయి.  ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా, చెన్నైలో రూ.65,800 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.65,900 ఉండగా, కోల్‌కతాలో రూ.61,800 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61, 800 ఉండగా, కేరళలో రూ.65,800 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి (silver) ధర రూ.65,800 ఉండగా, విజయవాడలో రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.

    బంగారం ధర (gold rates)ల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published: