మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా? మీ కాలనీలో దోమల సమస్య ఎక్కువగా ఉందా? దోమలు కుట్టి అనారోగ్యం పాలవుతున్నారా? దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధుల్లో మలేరియా, డెంగ్యూ టాప్‌లో ఉంటాయి. ప్రతీ ఏటా విజృంభించే సీజనల్ వ్యాధులు ఇవి. కావాలంటే ఇలాంటి వ్యాధులను కవర్ చేస్తూ ప్రత్యేకంగా ఓ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఇందుకోసం ఇన్స్యూరెన్స్ కంపెనీలు మషక్ రక్షక్ పాలసీని ఏప్రిల్ 1 నుంచి అందించనున్నాయి. మీకు ఇప్పటికే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉన్నా దానికి అదనంగా ఈ పాలసీ తీసుకోవచ్చు. వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే దోమలు, ఇతర కీటకాల వల్ల వచ్చే వ్యాధులను కవర్ చేసే అందించే పాలసీ ఇది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI గైడ్‌లైన్స్ ప్రకారం జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ పాలసీని రూపొందించాయి. ఏప్రిల్ 1 నుంచి మషక్ రక్షక్ పాలసీని అమ్మనున్నాయి.
PAN Card: ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్ పనిచేయదు... వెంటనే ఇలా చేయండి
Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? తెలుసుకోండి
డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువగా వర్షాకాలంలో విజృంభిస్తాయి. ఈ వ్యాధుల నుంచి కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. కన్సల్టేషన్ నుంచి మెడిసిన్ వరకు కనీసం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాలసీని రూ.10,000 నుంచి రూ.2,00,000 వరకు కవరేజీతో తీసుకోవచ్చు. ఒక ఏడాది టెన్యూర్‌తో ఈ పాలసీ వస్తుంది. పాలసీ ప్రీమియం రూ.800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. అయితే ప్రీమియం పాలసీ తీసుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కవరేజీ కావాలంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Bank Holidays: అలర్ట్... ఈ వీకెండ్ నుంచి 10 రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు
March 31 Last Date: అలర్ట్... ఈ పనులన్నింటికీ మార్చి 31 చివరి తేదీ... గుర్తుందా?
ఇప్పటికే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉన్నవారు, కార్పొరేట్ పాలసీపై ఆధారపడ్డవారు ఈ పాలసీని తీసుకోవడం ఉపయోగకరం. వారికి అదనపు రక్షణగా మషక్ రక్షక్ పాలసీ ఉంటుంది. దోమల కారణంగా వచ్చే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికున్ గన్యా లాంటి వ్యాధులకు 100 శాతం కవరేజీ లభిస్తుంది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి నియమనిబంధనలు తెలుసుకోవాలంటే ఏప్రిల్ 1 వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dengue fever, Health, Health care, Health Insurance, Health Tips, Personal Finance