Masala Dosa, Bombat Guru : కన్నడంలో ట్వీట్ చేసి మనసులు దోచుకున్న బ్రిటిష్ హై కమిషనర్.. ఏం చెప్పారంటే..

ప్రతీకాత్మకచిత్రం

ఆగస్టు 4న దోశను కత్తి, ఫోర్క్ తో తిన్న ఆయన ‘‘దోశను నేను ఎలా తినాలో చెప్పండి సౌతిండియా’’ అంటూ ఒక పోల్​ నిర్వహించారు.అందులో 92 శాతం మంది చేతులతో తినాలని, ఎనిమిది శాతం మంది మాత్రమే కట్లరీతో తినాలని ఓటేశారు.

  • Share this:
సాధారణంగా విదేశీయులు మన సొంత భాషలో మనల్ని పలకరిస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా,బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కన్నడిగులందరినీ కన్నడ భాషలో పలకరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు.రెండు రోజుల కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన తాను తిన్న దోశ గురించి ట్విట్టర్ లో పోస్ట్​ చేశారు. ఈ పోస్ట్​లో అనేక కన్నడ పదాలనుఉపయోగించారు.సకట్టగిడే, బొంబాట్ గురు.. లాంటి బెంగళూరు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే పదాలను వాడి ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్​ వైరల్​గా మారింది.ఆగస్టు నాలుగో తేదీన ఓ దోశ తింటూ సకట్టగిడే అంటూ పోస్ట్ చేశారు. ఈ పదానికి చాలా అద్భుతంగా ఉంది అని అర్థం. తన టూర్ ని ప్రారంభించిన రోజు నుంచే ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్లలో అనేక కన్నడ పదాలను ఉపయోగిస్తున్న భారతీయ భాషలపై తన ప్రేమను చాటుకున్నారు.ఇంగ్లిష్ పదాలతో పాటు కొన్ని కన్నడ పదాలు ఉపయోగించడంపై కన్నడ ప్రజలు సంతోషిస్తున్నారు.ఆయనట్వీట్ కన్నడిగులురీట్వీట్​ చేసి హోరెత్తిస్తున్నారు. కాగా,ఇటీవల ఆయన చేసేన ఓ ట్వీట్​కుకర్ణాటక చీఫ్ మినిస్టర్ బస్వరాజ్ బొమ్మై ని కూడా ట్యాగ్ చేశారు. నమస్కార ముఖ్యమంత్రి అవరె (నమస్కారం ముఖ్యమంత్రి గారు) అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ట్వీట్ ని ఇంగ్లిష్ లో కొనసాగించారు. తన పర్యటన ముగిసిన తర్వాత ధన్యవాదాలు ముఖ్య మంత్రి యవరె అంటూ ట్వీట్ చేశారు. దీనికి మీరు అందించిన సమయానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అని అర్థం.

అంతే కాదు.. ట్విట్టర్ లో సౌతిండియన్ స్పెషల్ అయిన మసాలా దోశ గురించి పోస్ట్ చేశారు. ఆగస్టు 4న దోశను కత్తి, ఫోర్క్ తో తిన్న ఆయన ‘‘దోశను నేను ఎలా తినాలో చెప్పండి సౌతిండియా’’ అంటూ ఒక పోల్​ నిర్వహించారు.అందులో 92 శాతం మంది చేతులతో తినాలని, ఎనిమిది శాతం మంది మాత్రమే కట్లరీతో తినాలని ఓటేశారు.ఆ తర్వాత రోజు చేత్తో దోశ తిన్న ఆయన దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అంతేకాదు.. దోశను చేత్తో తినడం వల్ల దాని రుచి పెరుగుతుంది. 92 శాతం మంది సరైన నిర్ణయమే చెప్పారు. మసాలా దోశ బొంబాట్ గురూ (మసాలా దోశ చాలా అద్భుతంగా ఉంది) అంటూ పోస్ట్ చేశారు. ఈ వరుస ట్వీట్లకు కొంత మంది నెటిజన్లుస్పందిస్తూ.. చాలా బాగా చెప్పారు అని.. మరికొందరు దోశను సాంబార్ తో కాకుండా చట్నీ, పాల్యాతో తిని చూడమని సలహాలిచ్చారు. దోశ తో పాటు పొంగల్, పూరీ లాంటివి కూడా ట్రై చేయమని కామెంట్లు చేశారు.
Published by:Krishna Adithya
First published: