Maruti Suzuki: తొలి ఎలక్ట్రిక్​ కారును విడుదల చేయనున్న మారుతి సుజుకి.. భారత మార్కెట్​లోకి ఎప్పుడంటే?

ప్రతీకాత్మకచిత్రం

జపాన్​కు చెందిన సుజుకీ 2025లో తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. మరో నాలుగేళ్లలో పూర్తిస్థాయి సుజుకీ ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తుందని నికీ వెల్లడించింది. భారత్​లో ఈ ఎలక్ట్రిక్ కారు మారుతీ సుజుకీగా విడుదలవుతుందని నికీ అభిప్రాయపడింది.

  • Share this:
ప్రస్తుతం వాహన తయారీ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో తలమునకలయ్యాయి. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు అధిక సబ్సిడీలు ఇస్తుండడంతో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. పర్యావరణ హితానికి ఎలక్ట్రిక్​ వాహనాలు ముఖ్యమవడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు ఇంధన ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే కొన్ని కార్ల సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్​లోకి తీసుకురాగా.. చాలా సంస్థలు ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో జపాన్​కు చెందిన సుజుకీ 2025లో తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. మరో నాలుగేళ్లలో పూర్తిస్థాయి సుజుకీ ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తుందని నికీ వెల్లడించింది. భారత్​లో ఈ ఎలక్ట్రిక్ కారు మారుతీ సుజుకీగా విడుదలవుతుందని నికీ అభిప్రాయపడింది. మొదట ఈ ఎలక్ట్రిక్​ కారు భారత మార్కెట్​లోకి వస్తుందని, ఆ తర్వాత జపాన్​, యూరప్ సహా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. అలాగే భారత్​లో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు ధర రూ.10.25 లక్షలు ఉండొచ్చని తెలిపింది. కాగా భారత్​లో వాగన్​ఆర్​ ఎలక్ట్రిక్ వెహికల్​ను మారుతీ సుజుకీ వచ్చే ఏడాది విడుదల చేస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే,దీనికి సంబంధించిఇంతవరకు మారుతి సుజుకి నుంచిఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, వాగన్​ఆర్ ఈవీ టెస్టింగ్కు సంబంధించినఫొటోలు మాత్రం బయటికి వచ్చాయి. మారుతీ సుజుకీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ప్రస్తుతం చార్జింగ్ ఇన్​ఫాస్ట్రక్చర్ లేని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టలేదని చెబుతూ వచ్చింది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడింది. అందుకే ఎక్కువగా సీఎన్​జీ, హైబ్రిడ్ కార్లపై మారుతీ సుజుకీ ఆసక్తి చూపిస్తోంది. అయితే మిగిలిన కంపెనీలు వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో సుజుకీ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది.

మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో భారత్​లో టాటా దూకుసుపోతోంది. టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాలు దూసుకుపోతున్నాయి. ఇదే తరుణంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చేందుకు టాటా ప్రయత్నాలు చేస్తోంది. అలాగే చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా టాటా పవర్ చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్​ (హెచ్​పీసీఎల్)తో ఒప్పందం చేసుకుంది. మొత్తానికి రానున్న రోజుల్లో భారత్​లో సంస్థల మధ్య ఎలక్ట్రిక్ వాహనాల్లో పోటీ కనిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: