హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Suzuki XL6: మారుతి సుజుకి నుంచి XL6 2022 మోడల్ కార్ లాంచ్.. ధర, మైలేజీ, ఇతర ఫీచర్లు ఇవే.. 

Maruti Suzuki XL6: మారుతి సుజుకి నుంచి XL6 2022 మోడల్ కార్ లాంచ్.. ధర, మైలేజీ, ఇతర ఫీచర్లు ఇవే.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటికప్పుడు బెస్ట్ కార్లను లాంచ్ చేస్తూ వాహనదారులు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్‌పై దృష్టి సారించింది.

ప్రముఖ ఆటోమొబైల్(Auto Mobile) దిగ్గజం మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పటికప్పుడు బెస్ట్ కార్లను లాంచ్(Launch) చేస్తూ వాహనదారులు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ (MPV) సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తాజాగా ఇండియాలో ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్‌ (XL6 Facelift) వెర్షన్‌ను(Version ) లాంచ్(Launch) చేసింది. దీని ప్రారంభ ధరను రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. దీనిలో టాప్ ఎండ్(Top End) ధర రూ.14 లక్షల పైగా ప్రైస్ ట్యాగ్‌తో(Tag) వచ్చింది. మూడు వేరియంట్‌లలో లాంచ్ అయిన 2022 ఎక్స్ఎల్6 కారు ఎక్స్‌టీరియర్‌ కాస్మెటిక్ అప్‌డేట్‌లతో సహా లోపలి భాగంలో న్యూ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఇందులో కొత్త గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో పాటు కొత్త పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. మరి కొత్తగా యాడ్ చేసిన కాస్మోటిక్ చేంజెస్, మిగతా ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి సుజుకి కంపెనీ కొద్దిరోజుల క్రితమే అప్‌డేటెడ్‌ ఎర్టిగా (Ertiga) వెర్షన్‌ను రూ.8.35 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లాంచ్ చేసింది. అయితే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 అనేది మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)కి మరింత ప్రీమియం వెర్షన్. ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ 2022 మోడల్ అప్‌డేటెడ్‌ ఫ్రంట్ గ్రిల్, వెనుక భాగంలో న్యూ క్రోమ్ స్ట్రిప్, 16-అంగుళాల సరికొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. రెడ్, బ్రౌన్, సిల్వర్ అనే కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌ల్లో ఇది లభిస్తుంది. ఇవన్నీ బ్లాక్-అవుట్ రూఫ్‌తో వస్తాయి.

Kia Electric Car: కియా నుంచి ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. బుకింగ్స్ ప్రారంభమయ్యేది అప్పుడే..


దీని ఫీచర్ల విషయానికొస్తే... ఇందులో కొత్తగా 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లేటెస్ట్ స్మార్ట్‌ప్లే (SmartPlay) సాఫ్ట్‌వేర్‌తో సహా 4 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించారు. అలాగే ఇది ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, యాంబియంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కూల్డ్ కప్‌హోల్డర్‌లు, డోర్ ల్యాంప్‌లను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. సుజుకి కనెక్ట్ మోడల్‌ ద్వారా మీరు ఇందులో దాదాపు 40 ఫీచర్లను రిమోట్‌గా ఆపరేట్ చేయవచ్చు. ఇది ఇండియాలో జీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ అనే 3 వేరియంట్‌లలో లభిస్తుంది. దీని టాప్ ఎండ్ కారు ధర రూ.14.55 లక్షలుగా నిర్ణయించారు.

కారులో కొత్తగా వచ్చిన మార్పుల గురించి తెలుసుకుంటే... ఇందులో 1.5-లీటర్ ఇంజన్ ఇచ్చారు. ఇది స్మార్ట్-హైబ్రిడ్ టెక్నాలజీ, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంది. దీని సాయంతో మాన్యువల్ వేరియంట్‌ కారు లీటర్‌కు 20.97 కిలోమీటర్లు (20.97 kmpl), ఆటోమేటిక్ వేరియంట్‌ కారు లీటర్‌కు 20.27 kmpl మైలేజీని అందిస్తుంది.

డ్రైవ్‌ట్రెయిన్ విషయానికి వస్తే... ఇందులోని 1.5-లీటర్ ఇంజన్ 103 హార్స్‌పవర్, 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనే రెండు ఆప్షన్లలో ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ ఆప్షన్స్‌ను 2022 ఎర్టిగా కూడా ఆఫర్ చేస్తుంది. రూ.24,599 ఆల్-ఇన్‌క్లూజివ్ ఛార్జీలతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా కూడా ఈ కారును పొందవచ్చని మారుతీ సుజుకి తెలిపింది.

First published:

Tags: Auto mobile, Maruti cars, MARUTI SUZUKI

ఉత్తమ కథలు