Home /News /business /

MARUTI SUZUKI WINTER CAR CARE CAMPAIGN OFFERS ON GENUINE PARTS AND ACCESSORIES MK GH

Maruti Suzuki Winter Care: మారుతి కారు ఉందా..అయితే ఈ శీతాకాలంలో మీకు బంపర్ ఆఫర్...

మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్

శీతాకాలం సీజన్‌ కోసం Maruti Suzuki కొత్త ఆఫర్లను ప్రకటించింది. Winter Care పేరుతో ఆ సంస్థ కార్ల విడిభాగాలు, నిర్వహణపై తమ కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. శీతాకాలంలో కార్ల విడిభాగాలు, యాక్సెసరీలను సమర్థంగా ఉపయోగించుకుంటూ అనవసర రిపేర్లకు దూరంగా ఉండేందుకు Genuine Parts & Accessoriesను వాడాలని Maruti Suzuki ప్రచారం చేస్తోంది.

ఇంకా చదవండి ...
దసరా, దీపావళి పండుగల తరువాత automobile industry కొత్త కళను సంతరించుకుంది. Corona, lockdown వల్ల పారిశ్రామిక రంగం కుదేలైన తరువాత కార్ల తయారీ సంస్థలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అనంతరం పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లతో అమ్మకాలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగాయి. ఇదే trendను కొనసాగించేందుకు చాలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. శీతాకాలం సీజన్‌ కోసం Maruti Suzuki కొత్త ఆఫర్లను ప్రకటించింది. Winter Care పేరుతో ఆ సంస్థ కార్ల విడిభాగాలు, నిర్వహణపై తమ కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. శీతాకాలంలో కార్ల విడిభాగాలు, యాక్సెసరీలను సమర్థంగా ఉపయోగించుకుంటూ అనవసర రిపేర్లకు దూరంగా ఉండేందుకు Genuine Parts & Accessoriesను వాడాలని Maruti Suzuki ప్రచారం చేస్తోంది.

ఆ సేవలు కూడా...
Winter Care campaignలో భాగంగా fog lamp, headlamp wipers, brakesను సరిచూసుకోవాలని Maruti Suzuki చెబుతోంది. ఈ సీజన్‌లో కాలుష్య సమస్యను ఎదుర్కోవటానికి ఉపయోగపడే Car Ionizer + Air Purifier, Cabin Air Filter PM 2.5, N95 Mask/ Germ Buster, AC Disinfectant, బాడీ కవర్.. వంటి వాటిని ఆ సంస్థ అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 2733 డీలర్ వర్క్‌షాప్‌లు, 758 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కస్టమర్లు వీటిని పొందవచ్చు. Health & Hygiene విభాగం కింద మారుతి సుజుకి వినియోగదారులు COVID-19 prevention accessoriesలను కూడా ఎంచుకోవచ్చు.

అవే వాడాలి..
కారు మోడల్‌ను బట్టి, వాటికి విడిభాగాలు, ఉపకరణాలను తయారుచేస్తామని.. ఒక్కో మోడల్‌కు ఒక్కో రకమైన పార్ట్స్, యాక్సెసరీస్ ఉంటాయని మారుతి సుజుకి తెలిపింది. అందువల్ల కారు పనితీరు కోసం సంస్థకు చెందిన Genuine Parts and Accessories మాత్రమే ఉపయోగించాలని ఆ సంస్థ తమ వినియోగదారులను కోరుతోంది. Genuine Parts వాడటం వల్ల దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీటితో కారు పనితీరు మెరుగవుతుంది. ఇటీవల ఆ సంస్థ 'Smart Finance' పేరుతో ఆన్‌లైన్‌ ఫైనాన్సింగ్ సేవలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా కస్టమర్లు తమకు అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ ఆప్షన్లతో సులభంగా కారును సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది.
Published by:Krishna Adithya
First published:

Tags: CAR, Cars

తదుపరి వార్తలు