దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, హోండా, టాటా మోటార్స్, వోక్స్ వాగన్లు తమ పాపులర్ మోడల్స్‌పై ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటించాయి. భారతదేశంలో జరుపుకునే ప్రధాన పండుగల్లో దసరా, దీపావళి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్న పండుగలని తెలిసిందే. అందువల్ల, ఈ సీజన్లోనే ఎక్కువ భాగం అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి, అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా భారీ ఆఫర్లను ప్రకటించాయి. దీనికి అనుగుణంగా భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి ఆఫర్లతో ముందుకొచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో అమ్మకాలు అంతగా జరగలేదు. కరోనాతో ఆటోమొబైల్ కంపెనీలు నష్టాలను చవిచూసినందున, వారు తమ అమ్మకాల గణాంకాలను పెంచుకోవడానికి ఈ పండుగ సీజన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాయి. భారీ డిస్కౌంట్లతో తమ సేల్స్ పెంచుకొని నష్టాల నుంచి గట్టెక్కాలని చూస్తున్నాయి. మరి ఆఫర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
ECLGS స్కీమ్ గడువు పెంపు... మోదీ ప్రభుత్వం ఇచ్చే రుణాలు తీసుకోండి ఇలాGoogle Pay: గూగుల్ పే ఉందా? ఈ గేమ్ ఆడితే రూ.501 మీవే
మారుతి సుజుకి
పండుగ సీజన్లో భాగంగా మారుతి సుజుకి కంపెనీకి చెందిన సియాజ్, డిజైర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ను అందించింది. ఈ మోడళ్లపై తగ్గిన అమ్మకాలను పునరుద్ధరించడానికి ఈ పండుగ సీజన్ సరైన సమయంగా భావిస్తుంది మారుతీ సంస్థ. మెట్రో ప్రాంతాల్లో సియాజ్ మోడల్‌పై రూ .60 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తుండగా, 2020 ఎడిషన్ డిజైర్ కొత్త మోడల్ రూ .42 వేల డిస్కౌంట్‌తో లభిస్తుంది. అదేవిధంగా, డిజైర్ పాత వెర్షన్‌పై రూ.57,000 డిస్కౌంట్‌ను అందిస్తుంది.
హోండా
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా తన మోడళ్లపై విస్తృత శ్రేణి తగ్గింపులను అందిస్తోంది. హోండా ఎంట్రీ లెవల్ సెడాన్, అమేజ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. దీనిలో భాగంగా అమేజ్ పెట్రోల్ వెర్షన్‌పై గరిష్టంగా రూ.47,000, డీజిల్ వెర్షన్‌పై రూ.30,000లను అందిస్తోంది. అంతేకాక, వినియోగదారులు తమ పాత కార్లను ఎక్స్చేంజ్ చేస్తే బోనస్‌గా రూ.15 వేల వరకు పొందుతారు. నాల్గవ, ఐదవ సంవత్సరానికి పొడిగించిన అదనపు వారంటీకి విలువైన రూ .12,000 చెల్లింపు మినహాయింపును కూడా పొందుతారు. సెడాన్ పెట్రోల్, డీజిల్ మోడళ్లపై వినియోగదారులకు రూ.10,000, రూ.20,000 నగదు తగ్గింపును కూడా అందిస్తుంది. ఐదవ తరం హోండా సిటీ మోడల్ కొనుగోలుపై రూ .30,000 వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. అంతేకాక, న్యూ జెన్ సెడాన్‌పై ఎక్స్ఛేంజ్ పథకం కింద రూ .30,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా ప్రకటించింది. దీంతో పాటు సివిక్ డీజిల్ వెర్షన్‌పై గరిష్టంగా రూ .2.5 లక్షల వరకు నగదు తగ్గింపును, పెట్రోల్ వెర్షన్‌పై రూ.1 లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది.
Bank Account: అలర్ట్... బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు డిసెంబర్ 31 లోగా ఈ పని చేయాల్సిందే
SBI Alert Message: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ 5 తప్పులు చేయొద్దంటున్న బ్యాంకు
వోక్స్ వాగన్
వోక్స్వాగన్ వెంటో మోడల్ దేశంలోనే అత్యంత వేగవంతమైన, ఉత్తమ కారులగా ప్రసిద్ధికెక్కింది. ఈ పండుగ సీజన్లో వెంటో వెర్షన్‌పై రూ.60,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది వోక్స్ వాగన్ సంస్థ.
టాటా మోటార్స్
టాటా టైగర్ వేరియంట్‌ను ఇటీవలే బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేసింది టాటా మోటార్స్ సంస్థ. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోల్ ఇంజన్‌తో రూపొందిన ఏకైక సెడాన్ మోడల్‌గా ఇది గుర్తింపు పొందింది. పండుగ సీజన్లో భాగంగా టైగర్ వేరియంట్‌పై రూ.30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన నగరం, రాష్ట్రంని బట్టి మారవచ్చు. కాబట్టి, మీ ప్రాంతంలో లభించే ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌షిప్‌ను సంప్రదించడం ఉత్తమం.