కొత్త ఏడాదిలో కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి అలెర్ట్. కొత్త సంవత్సరం 2023 జనవరిలో కార్‌ల ధరలు (Car Prices) పెరగనున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో కార్‌ల తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ, టాటా మోటర్స్ (Tata Motors) వంటి టాప్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా, తాజాగా ఈ జాబితాలో హ్యుందాయ్ చేరింది.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్(HMIL) కార్ల ధరల పెంపుపై ఒక ప్రకటన జారీ చేసింది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతోందని, దీంతో వివిధ మోడల్ రేంజ్ ధరలను సవరిస్తున్నామని తెలిపింది. ఈ చర్యలతో ఇన్‌పుట్ ధర పెరుగుదల్లో కొంత మొత్తం భర్తీ కానుందని పేర్కొంది. కస్టమర్లపై ధరల ప్రభావాన్ని తగ్గించడానికి స్థిరంగా ఇంటర్నల్ ఎఫర్ట్స్ కొనసాగిస్తామని హ్యుందాయ్ స్పష్టం చేసింది.
SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్
పోటీ సంస్థలైన మారుతి సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా, MG మోటార్స్ వంటి ఆటో మొబైల్ కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే హ్యుందాయ్ కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఎంత పరిమాణంలో ధరలు పెంచుతున్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.
టాటా మోటార్స్ -ప్యాసింజర్ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్యాసింజర్ వాహనాల ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కఠినమైన ఉద్గార నిబంధనలను బట్టి కార్‌ల మోడల్ ధరల్లో మార్పులు ఉంటాయని ఆయన చెప్పారు.
Araku One Day Tour: ఒక్క రోజులో అరకు చుట్టేసి వచ్చేయండి... ప్యాకేజీ వివరాలివే
రియల్-టైమ్ డ్రైవింగ్ ఉద్గార లెవల్స్‌ను మానిటరింగ్ చేయడానికి 2023 ఏప్రిల్ ఒకటి నుంచి వాహనాల్లో ఆన్-బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్ తప్పనిసరిగా ఉండాలి. ఉద్గారాలపై నిశిత నిఘా ఉంచడానికి ఈ డివైజ్ క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్స్ వంటి కీలకమైన పార్ట్స్‌ను స్థిరంగా మానిటర్ చేస్తుంది. గతంలో వాహనాల బ్యాటరీ ధరలు కూడా పెరిగాయి. కానీ తయారీదారులు ఇంకా పెరిగిన ధరలను వినియోగదారులపై మోపలేదు. ఇక, వచ్చే జనవరి నుంచి కార్ల ధరలు పెరగనుండడంతో బ్యాటరీ ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి.. ‘కొంత కాలం నుంచి దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతూ పోతుంది. ఈ ప్రభావం ఆటోమేకర్స్‌పై తీవ్రంగా పడింది. పెరిగిన ఇన్‌పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు వివిధ మోడల్స్ ధరల పెంపుతో కస్టమర్లపై కొంత భారం పడటం తప్పనిసరి. 2023 జనవరిలో కార్‌ల ధరలు పెరగనున్నాయి. అయితే ఈ పెంపు కార్ల మోడల్ బట్టి మారుతుంద’ని వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Cars, Tata, Tata Motors