Home /News /business /

MARUTI SUZUKI SWIFT TO HYUNDAI GRAND I10 NIOS KNOW ABOUT BEST CARS UNDER RS 7 LAKH SS GH

Best Selling Cars: రూ.7 లక్షల లోపు బెస్ట్ కార్స్ ఇవే

Best Selling Cars: రూ.7 లక్షల లోపు బెస్ట్ కార్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Best Selling Cars: రూ.7 లక్షల లోపు బెస్ట్ కార్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Best Selling Cars | కొత్త కారు కొనాలనుకుంటున్నారా? రూ.7 లక్షల లోపు బడ్జెట్‌లో మార్కెట్‌లో ఉన్న బెస్ట్ కార్స్ ఇవే.

గత సంవత్సరం పండుగ సీజన్‌ తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభాల బాట పట్టింది. గత ఏడాది ఆకట్టుకునే ఆఫర్లు, డిస్కౌంట్లతో కార్ల తయారీ సంస్థలు అమ్మకాలను పెంచుకున్నాయి. కొన్ని సంస్థలు భారీస్థాయిలో అమ్మకాలను, ఎగుమతుల వృద్ధిని నమోదు చేశాయి. దీంతో కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఇండస్ట్రీ, పండుగ సీజన్ తరువాత గాడిన పడింది. వాహనాల పనితీరు, భద్రత, మైలేజీలను దృష్టిలో పెట్టుకొని కొనాలనుకున్న కారుపై వినియోగదారులు ఒక నిర్ణయానికి రావాలి. వ్యాల్యూ ఫర్ మనీ సెగ్మెంట్‌లో కొన్ని చిన్న కార్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లకు బదులుగా, ప్రీమియం సెగ్మెంట్లో ఎక్కువ అమ్మకాలను ఇవి నమోదు చేశాయి. ఈ విభాగంలో రూ.7 లక్షల లోపు ధర ఉన్న కార్లలో టాప్-5 మోడళ్ల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి స్విఫ్ట్


గత సంవత్సరం అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాచ్ బ్యాక్ కార్లలో స్విఫ్ట్ ఒకటి. ఈ మోడల్‌ను ఫ్యామిలీ అవసరాల కోసం ఎక్కువమంది కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. చాలాకాలం నుంచి బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఈ వేరియంట్ కొనసాగుతోంది. మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటం, మంచి ఫీచర్లు, 268 లీటర్ల బూట్ స్పేస్ వంటివి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఇంటీరియర్స్, సౌండ్ సిస్టమ్, స్నాజీ ఫ్లాట్ బాటమ్డ్ స్టీరింగ్, యాక్సెటెడ్ గేజ్, ఆల్ బ్లాక్ టెక్చర్ వంటికి కారుకు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ ఎకానమీ కారు, అత్యధికంగా 21.21 కిలోమీటర్ల మైలేజీ అందిస్తోంది. దీని ఆన్ రోడ్ ధర రూ.6.41 లక్షలుగా ఉంది.

Tata Sky: ఈ కారు గెలుచుకోవాలంటే టాటా స్కై రీఛార్జ్ చేస్తే చాలు... కాంటెస్ట్‌లో పాల్గొనండి ఇలా

February New Rules: ఫిబ్రవరిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

మారుతి సుజుకి బాలెనో


బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లలో బాలెనో ఒకటి. ఫ్యూయల్ ఎకానమీ, బూట్ స్పేస్ పరంగా బాలెనోకు మంచి పేరు ఉంది. ఈ కారు సిగ్మా వేరియంట్లో EBD, ABS వంటి బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. బాలెనో బేస్ వెర్షన్ కాక్ పిట్ లే అవుట్, డిజైన్‌పై ఆధారపడుతుంది. దీని ఇంజిన్ స్విఫ్ట్ కంటే మెరుగైన పనితీరును, సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. బాలెనో కారు సిగ్మా, పెట్రోల్ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ.6.85 లక్షలు. ఇది లీటరుకు 21.01 వరకు మైలేజీని అందిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్


ఈ కారుకు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. డిజైన్ పరంగా ఇది ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. మ్యాండేటరీ ABSతో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబూషన్ వంటి ఫీచర్లు ఈ మోడల్ ప్రత్యేకతలు. ఆల్ట్రోజ్ కారులో రియర్ పవర్ విండోలు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటివి లేవు. ఇవి నియోస్ మోడల్‌లో ఉన్నాయి. కానీ ప్యాసింజర్, డ్రైవర్ల భద్రతకు భరోసా ఇచ్చే సేఫ్టీ ఫీచర్ల పరంగా ఆల్ట్రోజ్ కారుకు మంచి ఆదరణ ఉంది. ఈ కారు ఎక్స్ ఈ పెట్రోల్ వెర్షన్ ఆన్ రోడ్ ధర రూ.6.73 లక్షలు. ఇది ఒక లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

PM Kisan Scheme: ఈ చిన్న మిస్టేక్‌తో మీ అకౌంట్‌లోకి రూ.6000 రావు... సరిదిద్దుకోండి ఇలా

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయండి ఇలా

నిస్సాన్ మాగ్నైట్


నిస్సాన్ మాగ్నైట్ కారు విడుదలైనప్పటి నుంచి అమ్మకాల వృద్ధిని కొనసాగిస్తూనే ఉంది. దీని బేస్ వెర్షన్ కాస్త చిన్నదిగా, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది స్విఫ్ట్, నియోస్, ఆల్ట్రోజ్ మెడళ్లతో పోలిస్తే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల దీనికంటే పెద్దగా ఉండే టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. దీంట్లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోలు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు సేఫ్టీ రేటింగ్ కూడా మెరుగ్గానే ఉంది. కస్టమర్లు తమ అవసరాలను బట్టి ఎక్కువ ధర ఉండే వేరియంట్లను ఎంచుకోవచ్చు. ఈ మోడల్ కార్ల ఆన్ రోడ్ ధర రూ.6.46 నుంచి రూ.7.04 లక్షల వరకు ఉంటుంది. లీటరుకు 18.75 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్


హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఐ10 ఒక్కటే స్విఫ్ట్ కారుకు పోటీగా నిలుస్తోంది. డ్యాష్ బోర్డ్ క్వాలిటీ, పరికరాల నాణ్యత పరంగా నియోస్ ఏమాత్రం రాజీ పడదు. ఈ కారు బేస్ లెవల్ వెర్షన్ అయిన మాగ్నా వేరియంట్ మాత్రమే ఈ విభాగంలోకి వస్తోంది. ప్రీమియం లుకింగ్ క్యాబిన్‌తో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఫ్రంట్, రియర్ పవర్ విండోలు, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎలక్ట్రికల్ అడ్జెస్టబుల్ ORVMలు వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. దీని ఆన్ రోడ్ ధర రూ.6.96 లక్షలు. ఇది లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు