Home /News /business /

MARUTI SUZUKI SWIFT QUICK REVIEW HERE ARE THE PRICE DETAILS MK

దేశంలోనే నెంబర్ కారుగా Maruti Swift...కేవలం రూ.90 వేలుంటే చాలు..కొత్త కారు ఇంటి ముందే...

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

కొత్తగా లాంచ్ చేసిన 2020 డిజైర్ వాహనంలో మాదిరే మారుతీ సుజుకీ సిఫ్ట్ లో ఉన్న డ్యూయల్ జెట్ ఇంజిన్ ప్రత్యేకతగా నిలవనుంది. ఇది 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కే12బీ పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే దీని 7 పీఎస్ పవర్ ఎక్కువగా ఉండే వీలుంది.

ఇంకా చదవండి ...
    గత నెలతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గినప్పటికీ, 2020 నవంబర్ నెలలో 18,498 యూనిట్లు విక్రయించడంతో మారుతి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా తన స్థానాన్ని నిలుపుకుంది. 2020 సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ కాలంలో మారుతి స్విఫ్ట్ మొత్తం అమ్మకాలు 95,382 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం దాని మూడవ జనరేషన్ కారు మార్కెట్లో ఉంది. మారుతి స్విఫ్ట్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. LXi, VXi, ZXi, ZXi+ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 1.2-లీటర్ K12 పెట్రోల్ ఇంజిన్‌తో. గేర్‌బాక్స్ ఎంపికలలో ప్రామాణిక 5-స్పీడ్ మాన్యువల్ అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ మినహా అన్ని 5-స్పీడ్ AMT ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

    దేశంలో అత్యంత సక్సెస్ సాధించిన కార్లలో Maruti Swift ఒకటి ఈ కారు సేల్స్ పరంగా మంచి రికార్డు సాధించింది. అయితే 2020 సంవత్సరానికి గానూ ఈ కారు బీఎస్6 పొల్యూషన్ కంట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేసి 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ మోటార్ తో మార్కెట్లో ఈ నెల 15న అడుగు పెట్టనుంది. పాత మోడల్ లో కే12 బీ పెట్రోల్ ఇంజిన్, 1.3-లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఈ సరికొత్త 1.2-litre K12N DualJet petrol engineతో Maruti Swift మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.21 లక్షలుగా (ఎక్స్ షోరూం ధర) కంపెనీ నిర్దేశించింది.

    కొత్తగా లాంచ్ చేసిన 2020 డిజైర్ వాహనంలో మాదిరే మారుతీ సుజుకీ సిఫ్ట్ లో ఉన్న డ్యూయల్ జెట్ ఇంజిన్ ప్రత్యేకతగా నిలవనుంది. ఇది 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కే12బీ పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే దీని 7 పీఎస్ పవర్ ఎక్కువగా ఉండే వీలుంది. డిజైర్ వాహనంలో ఉన్న 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ఇంజిన్ ఆప్షన్ ఇందులో లేదు. అయితే ఫ్యూయల్ ఎఫిషియన్సీ, start/stop function కలిగి ఉండటం విశేషం.

    ఈ సరికొత్త సిఫ్ట్ వాహనం కూడా డిజైర్ డ్యూయల్ జెట్ వాహనం మాదిరి దీని మ్యానువల్ వేరియంట్ మైలేజి కూడా లీటరుకు గరిష్ఠంగా 24.12 కిలోమీటర్ల ఇస్తుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేసే వేరియంట్ అయితే లీటరుకు గరిష్ఠంగా 23.26 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. సిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ అయితే లీటరుకు గరిష్ఠంగా 21.21 కిలోమీటర్ల వరకు మైలేజి ఇస్తుందని తెలిపారు.

    కొత్త మారుతీ సుజుకీ సిఫ్ట్ డ్యూయల్ జెట్ పెట్రోల్ వేరియంట్ మోడల్ లో రీడిజైన్డ్ గ్రిల్, సరికొత్త బంపర్లు, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంపులు లాంటి వాటిని అప్ డేట్ చేశారు. కారు అంతర్భాగం గమనిస్తే అప్ డేటెడ్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, 7.0- అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో ఇంఫోటైన్మెంట్ సిస్టం ఇందులో ప్రత్యేకతలుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ సిఫ్ట్ డ్యూయల్ జెట్ పోటీగా ప్రస్తుతం Hyundai Grand i10 Nios, Tata Tiago, Ford Figo లాంటి కార్లు ఉన్నాయి.

    ఇక ధర విషయానికి వస్తే న్యూ ఢిల్లీలో Maruti swift LXI బేస్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 5.20 లక్షలుగా ఉంది. ఆన్ రోడ్ రూ. 5,73,036కు లభించనుంది. ( ధరలు నగరాన్ని బట్టి మారుతుంటాయి) కాగా ఈ కారును ఫైనాన్స్ పద్ధతిలో తీసుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో రూ. 90,000 లకే డౌన్ పేమెంట్ చెల్లించి కొత్త Maruti Swift LXI కొనుగోలు చేయవచ్చు. నెలకు ఈఎంఐ రూ. 8 వేల వరకూ బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: CAR, Cars

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు