news18-telugu
Updated: November 18, 2020, 4:06 PM IST
మారుతి స్విఫ్ట్
Maruti Swift: దేశంలో అత్యంత అధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కారు మోడల్ మార్కెట్లోకి విడుదలై 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం మారుతి స్విఫ్ట్ కొత్త మోడల్ (New Maruti Swift)ను ఈ జనవరిలో మార్కెట్లో విడుదల కానుంది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఇప్పటికే ఈ న్యూ మోడల్ స్విఫ్ట్ కారును తొలి సారి మార్కెట్లో ప్రవేశపెట్టారు. కాగా కారు డెలివరీని జనవరి నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రారంభ ధర ఎక్స్‌షోరూం ప్రకారం రూ. 5 లక్షలుగా ఉండనుంది. ఇక టాప్ వేరియంట్ రూ.8.00 లక్షలకు లభిస్తుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త స్విఫ్ట్ 12 వేరియంట్లలో, ఆరు రంగుల్లో లభిస్తుంది. BS6 మోడల్ తో మార్కెట్లోకి రావడంతో పాటు సరికొత్త స్విఫ్ట్ బుకింగ్స్ జనవరిలో ప్రారంభించనుంది.
కొత్త స్విఫ్ట్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్‌లోనూ వాడారు. 2005లో భారత్‌లో అమ్మకాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 18 లక్షల యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించారు. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్లో 35 శాతం వాటా దీనిదే కావడం విశేషం. అయితే ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్ మోడల్ కారు ధరలు చూసినట్లయితే ఈ కారు LXi Petrol Manual బేస్ వేరియంట్ గా అందుబాటులో ఉంది. కారు ఎక్స్ షోరూం ధర 5,19,000 రూపాయలుగా ఉంది. అలాగే ఈ కారు హైదరాబాద్ లో ఆన రోడ్ ధర 6,09,940 రూపాయలుగా ఉంది. (కార్ వాలే వెబ్ సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం) ఇక ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా 90,940 రూపాయలకే డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ EMI చెల్లించాల్సి ఉంటుంది.
Published by:
Krishna Adithya
First published:
November 18, 2020, 4:06 PM IST