Maruti Suzuki Swift: 2005లో మారుతి సుజుకీ స్విఫ్ట్ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటినుంచి దాని ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మార్కెట్లోకి నెలకో కొత్త మోడల్ వస్తున్నా.. బిఎస్ 6 మోడల్స్, పెట్రోల్ కార్లు వచ్చినా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
Maruti Suzuki Swift: కరోనా కారణంగా గతేడాది భారత ఆర్థిక వ్యవస్థ కే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే గజగజ వణికారు. ఇక పరిశ్రమలైతే దారుణాతి దారుణ నష్టాలను చవిచూశాయి. కొత్త ఉత్పత్తులు లేవు. అప్పటికే తయారైన ఉత్పత్తుల అమ్మకాలు లేవు. అమ్మకాలు లేక అన్నీ డీలాపడ్డాయి. ప్రముఖ బైక్ ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్సన్ భారత్ లో తన యూనిట్ లనే ఎత్తేసింది. ఇక ఖరీదైన వస్తువులుగా పేరున్న కార్ల గురించి ప్రత్యేకించి చెప్పాలా...? అమ్మకాలు లేక దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు పెట్టి మరీ కార్లను అమ్మాయి సంస్థలు. కానీ మారుతి సుజుకీ మాత్రం కరోనా లోనూ కింగ్ గా నిలిచింది.
మారుతి సుజుకీ స్విప్ట్ కార్లు 2020 లో భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు గా గుర్తింపు పొందింది. 2020లో స్విఫ్ట్ కార్లు 1.6 లక్షల యూనిట్లు అమ్ముడుపోయినట్టు ఆ సంస్థ ప్రకటించింది. గడిచిన పదేండ్ల మాదిరిగానే దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో స్విఫ్ట్ ముందంజలో నిలిచింది.
2005లో మారుతి సుజుకీ స్విఫ్ట్ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటినుంచి దాని ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మార్కెట్లోకి నెలకో కొత్త మోడల్ వస్తున్నా.. బిఎస్ 6 మోడల్స్, పెట్రోల్ కార్లు వచ్చినా స్విఫ్ట్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 2.3 మిలియన్ల (23 లక్షల) కార్లు అమ్మినట్టు సంస్థ ప్రకటించింది.
15 ఏళ్ల క్రితం దీని ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి స్విఫ్ట్ సెగ్మెంట్ లీడర్ గా ఉంది. బిఎస్ 6 యుగంలో కూడా పోటీని తట్టుకుని.. వినియోగదారుల అభిమానాన్ని చురగొంటుడం గమనార్హం.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.