మారుతి సుజుకి వినియోగారులకు షాక్... మార్కెట్ నుంచి 63,493 కార్ల రీకాల్

63,493 వాహనాలకు ఎంజియు సమస్యలు ఉన్నట్టు కంపెనీ గుర్తించిందని మారుతీ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారీ సమయంలో ఎంజియులో డిఫెక్ట్ వచ్చాయని గుర్తించింది.

news18-telugu
Updated: December 6, 2019, 10:56 PM IST
మారుతి సుజుకి వినియోగారులకు షాక్... మార్కెట్ నుంచి 63,493 కార్ల రీకాల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ దాదాపు 63,493 కార్లను రీకాల్ చేసింది. మోటార్ జనరేటర్ యునిట్ తప్పిదం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది. సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లు ఉన్నాయి. దాదాపు 63,493 వాహనాలకు ఎంజియు సమస్యలు ఉన్నట్టు కంపెనీ గుర్తించిందని మారుతీ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ గ్లోబల్ పార్ట్ సప్లయర్ తయారీ సమయంలో ఎంజియులో డిఫెక్ట్ వచ్చాయని గుర్తించింది. 2019 జనవరి 1 నుంచి 2019 నవంబర్ 21 మధ్య తయారు చేసిన వాహనాల్లో ఈ సమస్యలు తలెత్తినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా వాహనదారులు ఈ రోజు నుంచే మారుతి సుజుకి డీలర్లను సంప్రదించవచ్చని తన ప్రకటనలో సంస్థ యాజమాన్యం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు మారుతి తెలిపింది.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>