Car Discount | మారుతీ సుజుకీ కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? మారుతీ కార్లపై (Maruti Cars) భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెలలో మాత్రమే ఈ డీల్స్ లభిస్తాయి. అంటే డిసెంబర్ 31 వరకు ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. మారుతీ సుజుకీ (Maruti Suzuki) కార్ల ధరలు పెరగబోతున్నాయి. జనవరి నుంచి రేట్ల పెంపు ఉంటుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు ఈ నెలలో డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తుండటం గమనార్హం.
మారుతీ కార్లపై ఎక్స్చేంజ్ ఆఫర్, క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటి వాటి రూపంలో తగ్గింపు లభిస్తోంది. అలాగే ఉచిత యాక్ససిరీస్, కాంప్లిమెంటరీ సర్వీసులు వంటివి కూడా పొందొచ్చు. అయితే తాజా తగ్గింపు ఆఫర్లు మాత్రం ఎర్టిగా, బ్రెజా, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా వంటి మోడళ్లపై అందుబాటులో లేవు. అల్టో కే10 కారుపై రూ. 52 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15 వేల వరకు పొందొచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేల దాకా లభిస్తుంది.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఫ్లైట్ టికెట్ ఫ్రీ!
మారుతీ ఎస్ప్రెసో కారుపై రూ. 46 వేల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మారుతీ సెలెరియో కారుపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై రూ. 45,100 వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. మారుతీ వేగనార్ మోడల్‌పై అయితే రూ. 42 వేల తగ్గింపు లభిస్తోంది. అలాగే అల్టో 800 మోడల్‌పై కూడా ఇదే స్థాయిలో డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. స్విఫ్ట్, డిజైర్ వంటి కార్లపై రూ. 32 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
బ్యాంక్‌కు వెళ్లకుండా క్షణాల్లో అకౌంట్లోకి రూ.8 లక్షలు పొందండి.. ఎస్బీఐ బంపరాఫర్!
మరోవైపు కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. జనవరి నుంచి రేట్ల పెంపు వర్తిస్తుంది. ముడి పదార్ధాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పైకి కదిలాయని అందుకే ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని కంపెనీ వివరణ ఇచ్చింది. అంతేకాకుండా డిసెంబర్ నెలలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. చిప్ కొరత ఇందుకు కారణంగా పేర్కొంది. ఇకపోతే కారు ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్షిప్, మోడల్, వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల కారు కొనుగోలు చేయాలని భావించే వారు దగ్గరిలోని మారుతీ సుజుకీ షోరూమ్‌కు వెళ్లి డిసైకౌంట్ ఆఫర్ల పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget cars, Cars, Maruti cars, MARUTI SUZUKI