హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Suzuki Grand Vitara: ఇండియాలో అదిరే ఫీచర్లతో మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV లాంచ్.. ధర ఎంతంటే..

Maruti Suzuki Grand Vitara: ఇండియాలో అదిరే ఫీచర్లతో మారుతి సుజుకి గ్రాండ్ విటారా SUV లాంచ్.. ధర ఎంతంటే..

Maruti Suzuki Grand Vitara (PC : Maruti Suzuki)

Maruti Suzuki Grand Vitara (PC : Maruti Suzuki)

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ(Maruti Suzuki Grand Vitara)ని ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ.10.45 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. మోడల్‌ను బట్టి ఈ కారు ధర రూ.19.65 లక్షల వరకు ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రముఖ కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియాలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు అదిరిపోయే కార్లను లాంచ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ తాజాగా మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ(Maruti Suzuki Grand Vitara)ని ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ.10.45 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. మోడల్‌ను బట్టి ఈ కారు ధర రూ.19.65 లక్షల వరకు ఉంటుంది. దీనిని NEXA డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు పవర్, ఇంజన్ వివరాలు, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

* ఇంజన్‌ పవర్

గ్రాండ్ విటారా రెండు ఇంజన్‌లతో వస్తుంది. ఇవి రెండూ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు అయినా కూడా ఇవి ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో ఒకటి మైల్డ్ హైబ్రిడ్ లేదా స్మార్ట్ హైబ్రిడ్ కాగా మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ (ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్) ఇంజన్.

- మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్

గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లు 1.5L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్ ద్వారా నడుస్తాయి. మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ గరిష్ఠంగా 6,000 rpm వద్ద 101.6 bhp శక్తిని, 4,400 rpm వద్ద 136.8 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ సెటప్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, టార్క్ అసిస్ట్, ఐడిల్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లతో డ్యూయల్ బ్యాటరీ సెటప్‌తో వస్తుంది.

ఈ కారులో అందించిన 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 21.11 kmpl మైలేజ్‌.. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 20.58 kmpl మైలేజ్‌ పొందవచ్చు. కాగా మాన్యువల్ వేరియంట్లు సుజుకి ALLGRIP SELECT 4×4 డ్రైవ్ సిస్టమ్‌ను, 19.38 kmpl ఫ్యూయల్ ఎఫిషియన్సీని, ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ అనే నాలుగు డ్రైవ్ మోడ్‌లను ఆఫర్ చేస్తాయి. మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌లో 3-సిలిండర్ ఇచ్చారు.

- ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెర్షన్‌

కారులో ఆఫర్ చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌లో 4-సిలిండర్ ఇచ్చారు. ఈ హైబ్రిడ్ వెర్షన్‌ జీటా+, ఆల్ఫా+ ట్రిమ్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ వెర్షన్‌లో ఎలక్ట్రిక్ మోటార్, 1.5L పెట్రోల్ ఇంజన్‌ని అందించారు. డ్యూయల్ పవర్‌ట్రెయిన్ సిస్టమ్‌ గల ఈ కారు పెట్రోల్ ఇంజన్ ద్వారా 5,500 rpm వద్ద 91.2 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్, 1.5L పెట్రోల్ ఇంజన్ కలిసి 113.9 bhp పవర్ ఆఫర్ చేస్తాయి.

డ్యూయల్ పవర్‌ట్రెయిన్ సెటప్ 4,440-4,800 rpm వద్ద గరిష్టంగా 122 Nm టార్క్‌ను అందిస్తుంది. e-CVT ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ మోడల్ కారు 27.97 kmpl మైలేజీ ఆఫర్ చేస్తుంది. ఇది ఈవీ, ఎకో, పవర్, నార్మల్ డ్రైవ్ మోడ్స్‌లో వస్తుంది. ఈ కారు డ్రైవింగ్‌ స్టయిల్‌ను బట్టి ఏకకాలంలో పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటారు రెండింటిలోనూ రన్ అవుతుంది. గ్రాండ్ విటారాను ప్యూర్ ఈవీగా కూడా నడపవచ్చు. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ Li-ion బ్యాటరీ ప్యాక్‌పై 8 ఏళ్లు/160,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీతో వస్తుంది.

ఇది కూడా చదవండి : కొత్త జ్యుపిటర్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

* ఫీచర్స్‌

ఈ ఎస్‌యూవీలో డ్యూయల్ స్లైడింగ్ పేన్‌లతో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ డాక్, కలర్డ్ హెడ్-అప్-డిస్‌ప్లే, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా సిస్టమ్, ఇన్‌బిల్ట్ సుజుకి కనెక్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), అన్ని సీట్లకు 3-పాయింట్ ELR సీట్ బెల్ట్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లున్నాయి.

* కలర్ ఆప్షన్స్

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మూడు డ్యూయల్-టోన్, ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్స్‌తో 10 వేరియంట్లలో లాంచ్ అయింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, MARUTI SUZUKI, New car, New cars

ఉత్తమ కథలు