Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ టీజర్​ విడుదల.. భారత మర్కెట్​లోకి వెహికల్​ లాంచింగ్​ ఎప్పుడంటే?

Maruti Suzuki Jimny

మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవీ (Jimny SUV) ని టీజ్ చేసింది. నెక్సా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఎస్‌యూవీ టీజర్‌ని లాంచ్​ చేసింది. ఈ వాహనం జిమ్నీ కాంపాక్ట్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. అయితే ఇది త్రీ-డోర్స్ జిమ్నీగా రిలీజ్ కానుందని సమాచారం.

  • Share this:
భారతదేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతీ సుజుకీ Maruti Suzuki అన్ని రకాల వాహనాలు తయారు చేసేందుకు నడుంబిగించింది. ఇండియన్ కారు మార్కెట్లో ఆఫ్-రోడ్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో ప్రత్యర్థి కంపెనీలకు పోటీగా అదిరిపోయే ఆఫ్-రోడ్ వాహనాలను తీసుకొచ్చేందుకు ప్రస్తుతం మారుతీ సుజుకీ Maruti Suzuki ప్రయత్నాలు చేస్తోంది. వాహన ప్రియులు సైతం మారుతి సుజుకి Maruti Suzuki నుంచి మంచి ఆఫ్-రోడ్ వాహనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ స్వదేశీ కంపెనీ తీపి కబురు అందించింది. తాజాగా సోషల్ మీడియాలో జిమ్నీ ఎస్‌యూవీ (Jimny SUV) ని టీజ్ చేసింది. నెక్సా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా ఎస్‌యూవీ టీజర్‌ని లాంచ్​ చేసింది. ఈ వాహనం జిమ్నీ Jimny కాంపాక్ట్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. అయితే ఇది త్రీ-డోర్స్ జిమ్నీగా రిలీజ్ కానుందని సమాచారం. ఇది ఆఫ్-రోడ్ వాహనానికి సంబంధించిన ఫైవ్-డోర్స్ వెర్షన్ కాదని స్పష్టమవుతోంది. ఈ త్రీ-డోర్స్ జిమ్నీ వెహికల్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. జిమ్నీ ఫైవ్-డోర్స్ వెర్షన్ వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని అంచనా. కాగా, టీజర్ వీడియోలో ఎడారి రహదారిలో పడిన టైర్ గుర్తులు కనిపించాయి. "ఇక్కడ ఎవరు ఉన్నారో ఊహించండి" అని నెక్సా ఎక్స్పీరియన్స్ (nexaexperiance) ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్ ప్రశ్నించింది.

Petrol price hike: వరుసగా నాలుగో రోజు పెరిగిన ఇంధన ధరలు.. ఏ రాష్ట్రంలో ఎంత ధర ఉందంటే..?


అలాగే ఓ చిన్న వీడియో క్లిప్‌తో పాటు ఈ పోస్ట్‌కి క్యాప్షన్ జోడించింది. “ఒక వైల్డ్ అడ్వెంచర్స్ రైడ్ వివిధ భూభాగాల గుండా దూసుకెళ్తుంది! ప్రశ్న ఏమిటంటే, ఇది ఏ కారు? " అని మారుతి సుజుకిపేర్కొంది. మారుతి సుజుకి ప్రస్తుతం ఎస్‌యూవీ త్రీ-డోర్ వెర్షన్‌ని మనేసర్ (Manesar) లోని హర్యానా ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇక్కడ నుంచి వాహనాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. అయితే 2022లో ఆసియాలో ఫైవ్-డోర్స్ వెర్షన్ అందుబాటులోకి రావచ్చునని తెలుస్తోంది.

Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారా? 10 రోజుల్లో వెనక్కి పొందొచ్చు ఇలా


మహీంద్రా థార్​కు గట్టి పోటీ..

ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం అందించే స్పెసిఫికేషన్లు తెలుసుకుంటే.. జిమ్నీ 1.4-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బోచార్జ్డ్(turbocharged) పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. కానీ ఇండియా వెర్షన్ 1.5-లీటర్, 4-సిలిండర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6 కార్లలో ఉపయోగించిన ఇంజిన్‌యే జిమ్నీలో ఇవ్వనున్నారని సమాచారం. ఇది 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 101 బీహెచ్‌పీ.. 4,000 ఆర్‌పీఎమ్ వద్ద 130 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్‌లో ఐదు-స్పీడ్ మాన్యువల్(గేర్స్ ), నాలుగు ఆప్షనల్ స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్‌లు ఉంటాయి. జిమ్నీ లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడ్ వెహికల్ గా రిలీజ్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. మారుతీ నుంచి రాబోయే ఈ ఎస్‌యూవీ భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖాకు గట్టిపోటీ ఇవ్వనుంది.
First published: