Maruti Suzuki: వాహన ప్రియులకు బ్యాడ్​న్యూస్... భారీగా పెరిగిన మారుతీ కార్ల ధరలు.. ఏ మోడల్​కు ఎంతంటే?

ఫ్రతీకాత్మక చిత్రం

Maruti Suzuki: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకీ వాహన ప్రియులకు షాకిచ్చింది. తమ కంపెనీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.

  • Share this:
వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకీ వాహన ప్రియులకు షాకిచ్చింది. తమ కంపెనీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. గత నెలలోనే ధరల పెంపుపై కీలక ప్రకటన చేసిన కంపెనీ.. తన స్విఫ్ట్ వేరియంట్‌తో పాటు మొత్తం సిఎన్‌జి లైనప్ మోడళ్ల ధరలు పెంచుతామని తెలిపింది. తాజాగా వేరియంట్ల వారీగా ధరల పెరుగుదల గురించి వివరాలను వెల్లడించింది. భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి స్విఫ్ట్ ధరను రూ .15 వేల మేర పెంచింది. ధరల పెరుగుదల వేరియంట్ నుంచి వేరియంట్‌కు మారుతుంది. Vxi, Vxi AMT, Zxi, Zxi AMT, Zxi Plus, Zxi Plus AMT, Zxi Plus డ్యుయల్ టోన్ వంటి మోడళ్లపై గరిష్టంగా రూ. 15 వేల వరకు ధర పెంచేసింది. ఇదే క్రమంలో ఎల్‌సి వేరియంట్​ ధరను రూ .8 వేలు పెంచింది. ఇక, జెక్సీ ప్లస్ ఎఎమ్‌టి డ్యూయల్ టోన్ వేరియంట్‌పై అతి తక్కువగా రూ. 1000 ధర పెంచింది.

ఈ ధరల పెంపు నిర్ణయం గురించి కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘వివిధ ఇన్​పుట్ ఖర్చులు, ముడి సరుకు వ్యయాలు పెరగడం వల్ల ధరల పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. ధరల పెంపు వల్ల మా పాపులర్ వేరియంట్​​ మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ. 15 వేలు పెరుగుతుంది. ఇప్పటి వరకు ఇది రూ .8.41 లక్షల వద్ద లభిస్తుండగా.. ఇకపై, ఇది రూ .8.56 లక్షల ((ఎక్స్-షోరూమ్ ధర, ఢిల్లీ) ధర వద్ద లభించనుంది” అని చెప్పారు.

స్విఫ్ట్​ మోడల్​పై రూ.15 వేలు పెంపు..
కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఆటో మొబైల్​ అమ్మకాలు క్షీణించాయి. ఇప్పుడు, కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆటో మార్కెట్ దాని కోల్పోయిన వేగాన్ని తిరిగి పొందాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశంలోని ప్రధాన కార్ల తయారీదారులు జూన్ నెలలో అమ్మకాల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. జూన్​ నెలలో మారుతి సుజుకి మొత్తం 1,30,348 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మే నెలలో జరిపిన అమ్మకాల కంటే 35,293 యూనిట్లు ఎక్కువ అమ్మకాలు నమోదు చేయడం విశేషం.

ఎక్కువ అమ్మకాలు నమోదు చేసిన కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాల్లో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి మోడల్స్​ ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు మే నెలలో 20,343 ఉండగా.. జూన్​ నెలకు 68,849 యూనిట్లకు పెరిగింది. ఇక, ఆల్టో ఎస్-ప్రెస్సో అమ్మకాలు మే నెలలో 4,760 యూనిట్లు ఉండగా, జూన్ నెలలో 17, 439 యూనిట్లకు చేరింది.
Published by:Kishore Akkaladevi
First published: