హోమ్ /వార్తలు /బిజినెస్ /

Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా వర్సెస్ టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్.. రెండు SUVలను పోల్చి చూడండి..

Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా వర్సెస్ టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్.. రెండు SUVలను పోల్చి చూడండి..

Maruti Suzuki Grand Vitara (PC : Maruti Suzuki)

Maruti Suzuki Grand Vitara (PC : Maruti Suzuki)

Grand Vitara: ఇండియన్‌ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మిడ్‌ సైజ్డ్‌ విభాగంలో పోటీ పెరుగుతోంది. ప్రముఖ సంస్థలు ఈ సెగ్మెంట్ టార్గెట్‌గా కొత్త వాహనాలను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌, మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండూ ఈ విభాగంలో పోటీ పడనున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియన్‌ ఆటోమొబైల్ ఇండస్ట్రీ (Automobile Industry)లో మిడ్‌ సైజ్డ్‌ విభాగంలో పోటీ పెరుగుతోంది. ప్రముఖ సంస్థలు ఈ సెగ్మెంట్ టార్గెట్‌గా కొత్త వాహనాల (New Vehicles)ను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ (Toyota Urban Cruiser Hyryder), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) రెండూ ఈ విభాగంలో పోటీ పడనున్నాయి. ఇప్పటికే హైరైడర్‌ అధికారికంగా లాంచ్‌ అయింది. గ్రాండ్ విటారా సేల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ఎస్‌యూవీల ధర, ఫీచర్లను పోల్చి చూద్దాం.

* ధర

రెండు SUVల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టయోటా హైరైడర్ టాప్-4 వేరియంట్ల ధరలు రూ.15.11 నుంచి 18.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధరలు కూడా హైరైడర్‌ స్థాయిలోనే ఉండవచ్చని భావిస్తున్నారు.

* ఇంజిన్

టయోటా- సుజుకి ఒప్పందంలో భాగంగా రెండు SUVలలో ఒకే ఇంజిన్‌ను ఉపయోగించారు. మెకానికల్‌గా చూస్తే రెండు SUVలు ఒకే విధంగా ఉంటాయి. 1.5-లీటర్ ఇంటెలిజెంట్ హైబ్రిడ్ ఇంజిన్‌ ఆప్షన్‌తో వస్తాయి. పెట్రోల్‌ వెర్షన్.. 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 91 bhp, 4,400-4,800 ఆర్‌పిఎమ్ మధ్య 122 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి యూనిట్ 114 బిహెచ్‌పిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌తో వస్తున్న వేరియంట్‌లు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో వస్తాయి. ప్రోగ్రెసివ్‌ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5-లీటర్ K-సిరీస్ ఇంజిన్‌ కూడా ఉంది, ఇది గరిష్టంగా 102 bhp, 136 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

* వేరియంట్స్‌

గ్రాండ్ విటారా సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే నాలుగు గ్రేడ్‌లలో లభిస్తుంది. ఇవి తేలికపాటి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తాయి. జీటా ప్లస్, ఆల్ఫా ప్లస్ అనే రెండు అదనపు వేరియంట్‌లు బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఆప్షన్‌ E, S, G, V ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అయితే S, G, V డెరివేటివ్‌లు బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పొందుతాయి.

Toyota Urban Cruiser Hyryder (PC : Toyota)

* ఇంటీరియర్

గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒకే విధమైన స్టీరింగ్ వీల్ డిజైన్, AC వెంట్లతో వస్తాయి. సెంట్రల్ కన్సోల్ కూడా ఒకేలా కనిపిస్తుంది. అయితే, ఇంటీరియర్‌లలో ఉపయోగించే కలర్‌ స్కీమ్‌ రెండు SUVలలో భిన్నంగా ఉంటుంది.

Maruti Suzuki Grand Vitara (Photo: Manav Sinha/News18.com)

* ఎక్స్‌టీరియర్స్‌

మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ఎక్స్‌టీరియర్‌ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ SUV స్ప్లిట్ DRLలతో LED హెడ్‌ల్యాంప్‌లు, సుజుకి బ్యాడ్జింగ్‌తో బ్లాక్ క్రోమ్-ఫినిష్డ్ గ్రిల్, స్కిడ్ ప్లేట్‌లతో రూపొందింది. సైడ్ ప్రొఫైల్ బ్లాక్-అవుట్ పిల్లర్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్‌తో ఆకట్టుకుంటోంది. కారు వెనుక వైపు షార్క్-ఫిన్ యాంటెన్నా, కనెక్టెడ్‌ LED టెయిల్-ల్యాంప్‌లు వస్తాయి.

Toyota Urban Cruiser Hyryder (Photo: Toyota)

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో క్రిస్టల్ అక్రిలిక్ అప్పర్‌ గ్రిల్, వైడ్‌ ట్రాపెజోయిడల్ లోయర్ గ్రిల్‌తో కూడిన కర్వ్డ్ బంపర్ డిజైన్ ఉంది. DRLలతో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు వస్తాయి. ఇది సిల్వర్ రూఫ్ రైల్స్‌, బ్లాక్‌ OVRMలతో బ్లాక్-అవుట్ రూఫ్‌ దీని ప్రత్యేకత. వెనుక భాగం C-షేప్డ్ LED టెయిల్‌లైట్‌లు, డార్క్ క్రోమ్ ఇన్‌సర్ట్‌ ఇంట్రడ్యూస్‌ చేస్తోంది. SUV 17-అంగుళాల అల్లాయ్‌లతో వస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, MARUTI SUZUKI, New cars, SUV, Toyota

ఉత్తమ కథలు