హోమ్ /వార్తలు /బిజినెస్ /

SUVs Comparison: మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌.. ధరల పరంగా వీటిలో ఏది బెస్ట్‌?

SUVs Comparison: మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌.. ధరల పరంగా వీటిలో ఏది బెస్ట్‌?

Maruti Suzuki Grand Vitara  ( PC : Maruti Suzuki)

Maruti Suzuki Grand Vitara ( PC : Maruti Suzuki)

SUVs Comparison: మారుతి సుజుకి గ్రాండ్ విటారా సేల్స్ మొదలయ్యాయి. మిడ్‌ రేంజ్‌ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్ వంటి మోడల్స్‌ గ్రాండ్‌ విటారాకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ధరల పరంగా పరిశీలిస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో గ్రాండ్ విటారా పోటీ పడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఫెస్టివల్ సీజన్‌ (Festival Season)లో ఇండియన్ ఆటోమొబైల్ (Automobile) ఇండస్ట్రీ బిజినెస్ పెరిగింది. ఇటీవల లాంచ్ అయిన వెహికల్స్‌ గురించి కస్టమర్లు ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) సేల్స్ మొదలయ్యాయి. మిడ్‌ రేంజ్‌ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), కియా సెల్టోస్, MG ఆస్టర్ వంటి మోడల్స్‌ గ్రాండ్‌ విటారాకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ధరల పరంగా పరిశీలిస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో గ్రాండ్ విటారా పోటీ పడుతున్నాయి. ఈ మూడు వెహికల్స్‌ ధరలను పోల్చి చూద్దాం.

కియా సెల్టోస్ ఇండియన్‌ మార్కెట్లో 1.5L, 1.4L టర్బోచార్జ్డ్ యూనిట్ రూపంలో రెండు పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.4L వేరియంట్లు రూ.10.49 నుంచి రూ.15.45 లక్షల మధ్య ఉన్నాయి. 1.5L వేరియంట్లు రూ.16.05 నుంచి రూ.18.29 లక్షల రేంజ్‌లో (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) వస్తున్నాయి. గ్రాండ్ విటారాతో ఈ ధరలను పోలిస్తే.. స్మార్ట్ హైబ్రిడ్ కోసం రూ.10.45 నుంచి రూ.17.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కోసం రూ.17.99 నుంచి రూ.19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) అవసరం. అంటే ఇక్కడ కియా సెల్టోస్ మెరుగ్గా కనిపిస్తోంది.

* హ్యుందాయ్ క్రెటా ధరలు

హ్యుందాయ్ క్రెటా 1.5L MPI యూనిట్, 1.4L టర్బోచార్జ్డ్ GDi మోటార్ వంటి పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది. 1.5L పెట్రోల్ వేరియంట్లు రూ.10.44 నుంచి రూ.17.22 లక్షల మధ్య వస్తాయి. 1.4L టర్బో ట్రిమ్‌లు రూ.15.58 నుంచి రూ.18.15 లక్షల (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) డొమైన్‌లో ఉన్నాయి.

Hyundai Creta ( PC : Hyundai)

మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్, ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఓన్లీ వేరియంట్ల ధర రూ.10.45 నుంచి రూ.17.05 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ట్రిమ్‌ వేరియంట్ల ధరలు రూ.17.99 నుంచి రూ.19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. అంటే గ్రాండ్ విటారా టాప్-ఎండ్ గ్రేడ్‌లు కొంచెం ఎక్కువ ధరతో వస్తున్నాయి.

Kia Seltos ( PC : Kia)

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు పోటీ ఇస్తోంది. అయితే రాబోయే SUV బేస్, మిడ్ వేరియంట్‌ల ధరను టయోటా ఇంకా ప్రకటించలేదు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలు మార్కెట్లో అందుబాటులోకి రాక ముందే 50,000 బుకింగ్స్ వచ్చాయి. అయితే బుకింగ్‌ చేసిన వారంతా ధరలు అనౌన్స్ చేసిన తర్వాత కొనుగోలు చేస్తారా? లేదా? అనేది చెప్పడం కష్టం. మొత్తం అమ్మకాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవడానికి వేచి చూడాల్సిందే.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Hyundai, Kia cars, MARUTI SUZUKI, New cars

ఉత్తమ కథలు