Car Offers | కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మార్కెట్‌లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని మోడళ్లకు (Cars) ఒకే రకమైన డిమాండ్ ఉండదు. కొన్ని కార్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మరి కొన్ని కార్లను (Car Sales) కొనే వారు కూడా ఉండరు. అందుకే మీరు కూడా కారు కొనే ముందు ఈ విషయాన్ని చెక్ చేసుకోవాలి. కారు డిమాండ్ ఎలా ఉంది? దాని వెయిటింగ్ పీరియడ్ ఎంత? అనే విషయాలను చెక్ చేసుకోవాలి.
మారుతీ సుజుకీకి చెందిన గ్రాండ్ విటారా కారుకు కళ్లుచెదిరే డిమాండ్ ఉంది. మార్కెట్లో ఈ కారు కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఏకంగా ఇప్పటికే ఈ కారు కోసం లక్ష వరకు బుకింగ్స్ వచ్చాయి. మన దేశంలో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ ఉంది. టాటా మోటార్స్ ఈ విభాగంలో దుమ్మురేపుతోంది. చాలా ఎస్‌యూవీ మోడళ్లను కలిగి ఉంది. అయితే మారుతీ సుజుకీ కూడా ఎస్‌యూవీలను అందిస్తోంది. అయితే టాటా తర్వాతనే ఇది అని చెప్పుకోవాలి.
గుడ్ న్యూస్.. రూ.770 పడిపోయిన బంగారం ధర.. వెండి రూ.1,800 పతనం!
గ్రాంట్ విటారా ఎస్‌యూవీకి మార్కెట్లో సూపర్ డిమాండ్ ఉంది. ఎంతలా అంటే.. ఈ కారుకు ఇప్పటికే లక్ష వరకు బుకింగ్స్ వచ్చాయి. ఈ ఎస్‌యూవీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. కంపెనీ గత ఏడాదిలో ఈ మారుతీ సుజుకీ గ్రాంట్ విటారా కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి చూస్తే.. దీనికి లక్షక వరకు ఆర్డర్లు వచ్చాయి. ఈ కారు లీటరుకు 27.9 కి.మి. వరకు మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు.
ఈ 2 బ్యాంకుల కస్టమర్లకు షాక్.. రూ.5 వేల కన్నా ఎక్కువ డబ్బులు విత్‌డ్రా చేసుకోలేరు!
ఈ కారులో 45 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర చూస్తే.. రూ. 10.4 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా రూ. 19.49 లక్షల వరకు ఉంది. అలాగే కంపెనీ ఇందులో సీఎన్‌జీ వేరియంట్లను కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 12.85 లక్షల నుంచి ఉంది. గరిష్టంగా రూ. 14.84 లక్షలుగా ఉంది. టాయోటా హైయర్, మారుతీ గ్రాండ్ విటారా అనే రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు అయ్యాయి. అందుకే మీరు ఏ కారును బుక్ చేసుకున్న సరిపోతుంది. అయితే కారు కొనే ముందు ఒకటికి రెండు సార్ల ఆలోచించుకోవాలి. కారు కొనడం వల్ల దాని విలు ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుంది. అదే ఈ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మాత్రం.. అధిక రాబడి వస్తుందని చెప్పోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Stock Market