Maruti Suzuki: అర్జంటుగా కారు కావాలా...అయితే మారుతి సుజుకి నుంచి లీజ్ ఆఫర్..

మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ఆప్షన్‌లో కారును కొనకుండానే, నెలవారీగా కొంత మొత్తం చెల్లించి కార్లను వాడుకోవచ్చు. ఆ మొత్తంలోనే మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ రుసుము కలిపి ఉంటుంది.

news18-telugu
Updated: October 22, 2020, 1:05 AM IST
Maruti Suzuki: అర్జంటుగా కారు కావాలా...అయితే మారుతి సుజుకి నుంచి లీజ్ ఆఫర్..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్‌ సేవలను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే దిల్లీ- ఎన్‌సీఆర్, బెంగళూరులలో సబ్‌స్క్రైబ్ సేవలను ప్రవేశపెట్టిన ఆ సంస్థ.. తాజాగా హైదరాబాద్, పుణె నగరాలకు సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్‌లో భాగంగా సంస్థకు చెందిన వైట్ నంబర్ ప్లేట్‌తో ఉన్న కార్లను (కస్టమర్ పేరుతో రిజిస్టర్ చేస్తారు) కొన్ని నెలల వరకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. జపాన్‌కు చెందిన ORIX కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ORIX ఆటో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇండియా భాగస్వామ్యంతో ఈ పథకాన్ని మారుతి సుజుకి ప్రారంభించింది.

నెలవారీ రుసుము ఉంటుంది  

మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ఆప్షన్‌లో కారును కొనకుండానే, నెలవారీగా కొంత మొత్తం చెల్లించి కార్లను వాడుకోవచ్చు. ఆ మొత్తంలోనే మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ రుసుము కలిపి ఉంటుంది. ఈ స్కీమ్లో వినియోగదారులు తమకు నచ్చిన మారుతి సుజుకి కార్లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ జాబితాలో స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా, నెక్సా నుంచి బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్ 6 కొత్త కార్లు ఉన్నాయి.

కస్టమర్ల ఆసక్తి

 వ్యక్తిగత వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ పథకాన్ని రూపొందించామని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు. ‘ఈ స్కీమ్‌లో సౌకర్యవంతమైన ఎంపికలు ఉంటాయి. టెన్యూర్, జీరో డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్తో పాటు కంప్లీట్ మెయింటెనెన్స్ సేవలు కూడా ఉంటాయి. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రారంభించిన కొన్ని వారాల్లోనే 5,000కి పైగా ఎంక్వైరీ కాల్స్‌ వచ్చాయి. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో 40 నుంచి 60 నగరాలకు సబ్‌స్క్రైబ్ సేవలను విస్తరించే పనిలో ఉన్నాం’ అని ఆయన వివరించారు.

 ప్రైవేట్ రిజిస్ట్రేషన్‌ చేస్తారు

మారుతి సుజుకి సబ్‌స్క్రైబ్ ఆప్షన్‌లో ప్రైవేట్ రిజిస్ట్రేషన్‌తో కస్టమర్లకు సేవలందిస్తారు. 24, 36, 48 నెలల వరకు కారును సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. స్విఫ్ట్ Lxi కారును హైదరాబాద్‌లో 48 నెలల వరకు ఉపయోగించుకోవాలనుకుంటే రూ.15,479 (పన్నులతో కలిపి), పుణెలో రూ.15,354 (పన్నులతో కలిపి) నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాలి.

నచ్చిన కారు తీసుకోవచ్చు

వినియోగదారులు తమకు ఇష్టమైన మారుతి సుజుకి వాహనాలను వాడుకోవడానికి సబ్‌స్క్రైబ్ ఆప్షన్‌ ఉపయోగపడుతుందని ORIX ఇండియా ఎండీ, సీఈఓ సందీప్ గంభీర్ చెబుతున్నారు. ‘ORIX ఇండియా, మారుతి సుజుకి భాగస్వామ్యంలో గత కొన్ని నెలలుగా ఈ స్కీమ్‌పై పరిశోధన చేస్తున్నాం. గత రెండు, మూడు నెలల్లో ఈ సేవలను ప్రారంభించిన అన్ని నగరాల్లో మంచి స్పందన లభించింది. దీంతో హైదరాబాద్, పుణె నగరాలకు సేవలను విస్తరించాం. త్వరలో మరిన్ని ప్రాంతాలకు సబ్‌స్క్రైబ్ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం ఎక్కువమంది కస్టమర్లకు చేరువ అవుతుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.

సబ్‌స్క్రిప్షన్‌ గడువు పూర్తయిన తరువాత వినియోగదారులు వాహనాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదా గడువును మరికొంత కాలం పొడిగించుకోవచ్చు. లేదంటే మార్కెట్ రేటు ప్రకారం ఆ కారును కొనుక్కోవచ్చు.
Published by: Krishna Adithya
First published: October 22, 2020, 1:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading