MARUTI SUZUKI ERTIGA BECOMES 2ND HIGHEST SELLING CAR IN INDIA 1ST MPV TO FEATURE IN TOP 3 HERE FULL DETAILS NS GH
Maruti Suzuki Ertiga: దుమ్ములేపుతున్న ఎర్టిగా కారు.. అరుదైన రికార్డు సొంతం.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇండియా తన ఎర్టిగా మల్టీపర్పస్ వెహికల్(MPV)ను గత నెల ఏప్రిల్‌లో కొత్తగా అప్డేట్ చేసి మార్కెట్లోని విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న MPVగా మారుతి సుజుకీ ఎర్టిగా రికార్డ్ సృష్టించింది.
దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki ) ఇండియా తన ఎర్టిగా మల్టీపర్పస్ వెహికల్(MPV)ను గత నెల ఏప్రిల్‌లో కొత్తగా అప్డేట్ చేసి మార్కెట్లోని విడుదల చేసింది. గతంలోనూ ఈ ఎర్టిగా ఎంపీవీ అమ్మకాల్లో వృద్ధి కనిపించినా ఇటీవల కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న MPVగా మారుతి సుజుకీ ఎర్టిగా రికార్డ్ సృష్టించింది.
ఎర్టిగా కొత్త ఫీచర్లు
న్యూ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో, మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో అప్డేట్ అయిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇంజిన్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఎర్టిగా 103 హార్స్పవర్, 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో 20.51 kmpl, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 20.30 kmpl మైలేజీని అందిస్తుంది.
పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఎర్టిగా పెట్రోల్‌తో 20.51 కి.మీ/లీ, సీఎన్జీతో 26.11 కి.మీ/కే.జీ మైలేజీని అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. క్రూజ్ కంట్రోల్, ‘ఫాలో మీ హోం’ ఫంక్షనాలిటీతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్స్, సీఎన్జీ వెర్షన్‌కు ప్రత్యేకమైన స్పీడోమీటర్ వంటి కొత్త ఫీచర్లును తీసుకొచ్చారు.
అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి
అమ్మకాల సంఖ్యను బట్టి చూస్తే 2022లో మారుతి సుజుకి ఎర్టిగా సూపర్ హిట్ అయింది. ఏప్రిల్ 2022లో ఎర్టిగా అమ్మకాలు ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. గత నెలలో దాదాపు 14,889 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చుకుంటే ఈసారి దాదాపు 72 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ తెలిపింది. కాగా, 2021 ఏప్రిల్ లో ఎర్టిగా MPV కేవలం 8,644 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఎర్టిగాలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాల్లో చోటుచేసుకున్నాయని బిజిసెస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
అంతేకాకుండా అప్డేట్ చేయబడిన మారుతి సుజుకి ఎర్టిగా తాజాగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండవ స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలోని చాలా హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలను ఇది మించిపోయింది. ఒక MPV మోడల్ కార్ టాప్ 3 స్థానంలో నిలవడం కూడా ఇదే తొలిసారి. అమ్మకాల పరంగా టయోటా ఇన్నోవా క్రిస్టా.. ఎర్టిగాకు సమీప పోటీనిస్తోంది.
మారుతి సుజుకీ 2022 ఎర్టిగా ధర రూ. 8.35 లక్షల నుండి రూ. 12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఈ కారు VXi, ZXi టూర్ M ట్రిమ్ వంటి వేరియంట్లలో లభ్యమవుతుంది. కాగా, మారుతి సుజుకీ కంపెనీకి చెందిన మరో కారు XL6 కూడా ఇటీవల అప్ డేట్ అయి అవతార్ పేరుతో విడుదల చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.