హోమ్ /వార్తలు /బిజినెస్ /

Second Hand Cars- Bikes Sales: సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్..

Second Hand Cars- Bikes Sales: సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Second Hand Cars- Bikes Sales: 2020లో అమ్మిన సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల యావరేజ్ ఓనర్‌షిప్ గడువు 67 నెలల నుంచి 77 నెలలుగా ఉన్నట్లు డ్రూమ్ నివేదిక తెలిపింది.

దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరో రికార్డు సాధించింది. మారుతి నుంచి విడుదలయ్యే కొత్త మోడల్ కార్ల కోసం ఎంతోమంది కస్టమర్లు ఎదురు చూస్తుంటారు. అయితే ఆ సంస్థ విడుదల చేసిన డిజైర్ కారుకు ఆదరణ ఇంకా తగ్గలేదని తాజా నివేదిక చెబుతోంది. 2020లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కారుగా డిజైర్ నిలిచింది. గతేడాది దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్‌గా బజాజ్ పల్సర్ నిలిచింది. ఆన్ లైన్ ప్రీ ఓన్డ్ ఆటోమొబైల్ సంస్థ డ్రూమ్ ఈ గణాంకాలను వెల్లడించింది. యాన్యువల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రెండ్ రిపోర్ట్- 2020 పేరుతో డ్రూమ్ ఒక నివేదికను విడుదల చేసింది. 2020లో ప్రీ ఓన్డ్ కార్ల సగటు అమ్మకం ధర రూ.8,38,827గా ఉంది. ఈ విభాగంలో మోటార్ సైకిళ్ల సగటు ధర రూ.47,869గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

2020లో అమ్మిన సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌ల యావరేజ్ ఓనర్‌షిప్ గడువు 67 నెలల నుంచి 77 నెలలుగా ఉన్నట్లు డ్రూమ్ నివేదిక తెలిపింది. గత సంవత్సరం అమ్మిన మొత్తం ప్రీ ఓన్డ్ కార్లలో 34 శాతం పెట్రోల్ కార్లు, 65 శాతం డీజిల్ మోడళ్లు, ఒక శాతం పెట్రోల్+సీఎన్‌జీ కార్లు ఉన్నాయి. ఇదే సంవత్సరం అమ్ముడైన సెకండ్ హ్యాండ్ కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నవి 63 శాతం ఉన్నాయి. మిగిలినవి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లు. వైట్, సిల్వర్, గ్రే కలర్ ఆప్షన్లపై ఎక్కువమంది కస్టమర్లు ఆసక్తి చూపించారు. మొత్తం ప్రీ ఓన్డ్ కార్లలో 49 శాతం మంది వైట్ కలర్, 16 శాతం మంది సిల్వర్, 10 శాతం గ్రే కలర్‌ను ఎంచుకున్నారు.

గత సంవత్సరం అమ్మిన మొత్తం ప్రీ ఓన్డ్ కార్లలో 36 శాతం భారతీయ కంపెనీలు, 22 శాతం జపాన్, 18 శాతం జర్మన్, 12 శాతం దక్షిణ కొరియా సంస్థలవి ఉన్నాయి. ఈ వివరాలను డ్రూమ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సందీప్ అగర్వాల్ వెల్లడించారు. డ్రూమ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ఆటోమొబైల్స్ కొనుగోళ్లు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో కార్ల కొనుగోలు, అమ్మకాలపై కస్టమర్ల యాక్టివిటీ ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేశారు. ఇందుకు మొత్తం 1.1 బిలియన్ విజిటర్లు, 20,000కంటే ఎక్కువమంది డీలర్లు, 1,086 నగరాలు, 3 మిలియన్ లిస్టింగ్స్, 3,15,000 వరకు అమ్మిన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Auto News, Automobiles, Bajaj, MARUTI SUZUKI

ఉత్తమ కథలు