MARUTI SUZUKI DISCOUNT OFFERS IN MAY HERE IS THE DETAILS OF DEALS ON SWIFT WAGONR ALTO AND MORE NS GH
Maruti Suzuki Offers: కొత్తగా కారు కొనాలనుకుంటున్న వారికి మారుతి సుజుకి బంపరాఫర్.. ఈ మోడల్స్ పై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్ల వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
మారుతి సుజుకి కార్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. కొత్తగా కారు కొనాలనుకునే వారు ఈ నెలలో తక్కువ ధరకే మారుతి సుజుకి కారును కొనుగోలు చేయవచ్చు. నెక్సా (Nexa), ఎరీనా (Arena) డీలర్‌షిప్‌లలో మంచి డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
మారుతి సుజుకి (Maruti Suzuki) కార్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. కొత్తగా కారు కొనాలనుకునే వారు ఈ నెలలో తక్కువ ధరకే మారుతి సుజుకి కారును (Car) కొనుగోలు చేయవచ్చు. నెక్సా (Nexa), ఎరీనా (Arena) డీలర్‌షిప్‌లలో మంచి డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌లు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ బెనిఫిట్స్, క్యాష్ డిస్కౌంట్ రూపంలో ఉంటాయి. అయితే ఈ నెలలో CNG కార్లపై ఈ ఆఫర్లను కంపెనీ అందించట్లేదు. ఎరీనా షోరూమ్ నుంచి మారుతి సుజుకి కారును కొనుగోలు చేసేవారు ఈ నెలలో పొందగల బెనిఫిట్స్ ఏవో చూద్దాం.
- ఆల్టో 800 (Alto 800) పెట్రోల్, స్టాండర్డ్ వేరియంట్‌ను కూడా ఈ నెలలో రూ. 21,000 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎరీనా షోరూమ్‌లలో ఈ కారుపై రూ.8,000 క్యాష్ డిస్కౌంట్ ఉంది. రూ.3,000 కార్పొరేట్ ఆఫర్, రూ.15,000 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. Top 10 Safest Cars: సేఫెస్ట్ కార్ కోసం చూస్తున్నారా? భారతదేశంలో టాప్ 10 కార్లు ఇవే
- మారుతి నుంచి వచ్చిన సరసమైన సెడాన్, DZire MTపై కూడా ఈ నెలలో రూ. 23,000 వరకు డిస్కౌంట్ ఉంది. రూ. 3,000 కార్పొరేట్ బెనిఫిట్ పాటు ఒక్కొక్కరు రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందవచ్చు.
- మారుతి సుజుకి మినీ SUV, S-Presso MT కొనుగోలుపై రూ. 28,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎరీనా షోరూమ్‌లో దీనిపై రూ. 15,000 విలువైన క్యాష్ డిస్కౌంట్, రూ. 3,000 కార్పొరేట్ బోనస్, రూ. 10,000 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి.
- ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Wagon R) ఒకటి. ఈ వెహికల్ కూడా మే నెలలో చౌకగా లభిస్తుంది. WagonR 1.0-లీటర్ వేరియంట్‌పై రూ. 38,000 వరకు డిస్కౌంట్ ఉంది. అయితే ఈ కారు 1.2-లీటర్ వేరియంట్‌పై మాత్రం రూ. 18,000 వరకు ఆఫర్ ఉంది.
- సెలెరియో (Celerio) మోడల్‌ను కొనుగోలు చేసేవారు రూ. 33,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తంలో రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ బెనిఫిట్, రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్ ఉన్నాయి.
- విటారా బ్రెజ్జా (Vitara Brezza) కూడా ఆఫర్‌లో తక్కువ ధరకే లభిస్తుంది. ఈ మోడల్‌పై రూ. 18,000 వరకు ఆదా చేసుకోవచ్చు. రూ. 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు, రూ. 5,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 3,000 కార్పొరేట్ బెనిఫిట్స్ పొందవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.