Home /News /business /

MARUTI SUZUKI CNG MODELS ACCOUNT FOR 15 PERCENT OF OVERALL SALES IN INDIA GH VB

Maruti Suzuki: మార్కెట్ లీడ‌ర్‌గా అవ‌త‌రించ‌బోతున్న‌ మారుతి సుజుకి.. కారణం ఏంటో తెలుసా..?

దేశంలోని చాలా ఆటోమొబైల్ (Automobiles) సంస్థ‌లు బీఎస్‌-6 నార్మ్స్‌తో కూడిన ఇంజిన్ల‌ను త‌యారు చేయ‌డ‌మో లేక ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ (EV) వైపు అడుగులు వేయ‌డ‌మో చేస్తుంటే.. ఇండియాలో నంబర్‌ వన్ కార్ల త‌యారీ సంస్థ‌ మారుతి సుజుకి మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకుంది.

దేశంలోని చాలా ఆటోమొబైల్ (Automobiles) సంస్థ‌లు బీఎస్‌-6 నార్మ్స్‌తో కూడిన ఇంజిన్ల‌ను త‌యారు చేయ‌డ‌మో లేక ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ (EV) వైపు అడుగులు వేయ‌డ‌మో చేస్తుంటే.. ఇండియాలో నంబర్‌ వన్ కార్ల త‌యారీ సంస్థ‌ మారుతి సుజుకి మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకుంది.

దేశంలోని చాలా ఆటోమొబైల్ (Automobiles) సంస్థ‌లు బీఎస్‌-6 నార్మ్స్‌తో కూడిన ఇంజిన్ల‌ను త‌యారు చేయ‌డ‌మో లేక ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ (EV) వైపు అడుగులు వేయ‌డ‌మో చేస్తుంటే.. ఇండియాలో నంబర్‌ వన్ కార్ల త‌యారీ సంస్థ‌ మారుతి సుజుకి మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకుంది.

ఇంకా చదవండి ...
దేశంలోని చాలా ఆటోమొబైల్ (Automobiles) సంస్థ‌లు బీఎస్‌-6 నార్మ్స్‌తో కూడిన ఇంజిన్ల‌ను త‌యారు చేయ‌డ‌మో లేక ఎల‌క్ట్రిక్ వెహికిల్స్ (EV) వైపు అడుగులు వేయ‌డ‌మో చేస్తుంటే.. ఇండియాలో నంబర్‌ వన్ కార్ల త‌యారీ సంస్థ‌ మారుతి సుజుకి మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకుంది. బీఎస్‌-6 నార్మ్స్ కార‌ణంగా ఈ ఇండో-జ‌ప‌నీస్ సంస్థ గ‌తేడాది నుంచే డీజిల్ కార్ల‌ను త‌యారు చేయ‌డం మానేసింది. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా compressed natural gas (CNG) సెగ్మెంట్‌లోకి ప్ర‌వేశించింది. త‌క్కువ కాలంలోనే స‌క్సెస్ అయ్యి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఈ సీఎన్‌జీ మోడ‌ల్స్‌కు భారీ డిమాండ్ నెల‌కొన్న‌ట్లు మారుతి సుజుకి ప్రతినిధులు తెలిపారు. డిసెంబ‌ర్ 2021 నాటికి అమ్ముడైన మారుతి కార్ల‌లో 15 శాతం వాటా సీఎన్‌జీ మోడ‌ల్స్‌వే అని బీహెచ్‌పీ త‌న నివేదిక‌లో పేర్కొంది.

సీఎన్‌జీ మోడ‌ల్స్‌లో అత్య‌ధికంగా అమ్ముడైన మోడ‌ల్‌గా స్విప్ట్ డిజైర్ టూర్‌-ఎస్ (Tour S) నిలిచింది. మొత్తం సీఎన్‌జీ కార్ల సేల్స్‌లో దీని వాటా 78 శాతం కావ‌డం విశేషం. దీని త‌ర్వాతి స్థానంలో ఎర్టిగా ఉంది. గ‌త మూడు త్రైమాసికాల్లో మారుతి మొత్తం 1.32 ల‌క్ష‌ల సీఎన్‌జీ కార్ల‌ను విక్ర‌యించ‌డం విశేషం. అంతేకాకుండా వీటి మార్కెట్ షేర్ ఏకంగా 82.5గా ఉన్న‌ట్లు రిపోర్ట్ తెలిపింది.

Women’s Shabarimala: ఈ టెంపుల్ మహిళల శబరిమల.. ఆడవాళ్లు ఇరుముడితో వెళ్లే ఈ ఆలయం ప్రత్యేకతలివే..


మ‌రిన్ని మోడ‌ల్స్‌ తీసుకొచ్చేలా...
సీఎన్‌జీ మోడ‌ల్స్‌కు ఇలాగే ఆద‌ర‌ణ కొన‌సాగితే త్వ‌ర‌లోనే ఈ సెగ్మెంట్‌లో మ‌రిన్ని మోడ‌ల్స్‌ను తీసుకొచ్చేలా మారుతి ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. ఒక‌వైపు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారీగా ఉండ‌టంతో చాలా మంది ప్ర‌త్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్, సీఎన్‌జీ వైపు చూస్తున్నారు. ఈవీ కార్ల ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టం... రీచార్జ్ స‌మ‌యం ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌స్తుతం సీఎన్‌జీ వాహ‌నాల‌కు డిమాండ్ ఏర్ప‌డుతుంది. దీన్ని క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోన్న మారుతి సీఎన్‌జీ సెగ్మెంట్‌లో మ‌రో 10 మాడ‌ల్స్‌ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మవుతోంది. బ్రెజా సీఎన్‌జీ మోడ‌ల్ ఈ ఏడాది విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే డీజిల్ కార్ల కంటే కూడా సీఎన్‌జీ కార్లే ఎక్కువ‌గా భార‌త రోడ్ల‌పై ప‌రుగులు తీసే అవ‌కాశం ఉన్న‌ట్లు మారుతి ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది.

Padma Sri: జామియా మిలియా వర్సిటీ తొలి మహిళా వీసీకి పద్మశ్రీ.. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే..


ఫ్యూచ‌ర్ సీఎన్‌జీ వాహ‌నాల‌దేనా...
2022లో సీఎన్‌జీ వాహ‌నాల‌కు మ‌రింత డిమాండ్ పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు మారుతి విశ్వాసం వ్య‌క్తం చేస్తుంది. దానికి కార‌ణం వాటి మెయింట‌నెన్స్‌కు అయ్యే ఖ‌ర్చు. ప్ర‌స్తుతం సీఎన్‌జీ కార్ల ధ‌ర పెట్రోల్ కార్ల‌కంటే కూడా 1 ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల మేర ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే ఈ వ్య‌త్యాసం రానున్న రోజుల్లో త‌గ్గ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా లీట‌ర్ సీఎన్‌జీ ఇంధ‌నం రూ. 47-50 మ‌ధ్య ఉండ‌గా... పెట్రోల్ ధ‌ర‌ రూ.100కు పైగానే ఉంది.

దీని ప్ర‌కారం లెక్క వేసుకుంటే పెట్రోల్‌ (petrol), డీజిల్ (diesel) వాహ‌నాల కోసం ఒక కిలీ మీట‌ర్‌కు రూ. 5 ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఉండ‌గా... అదే సీఎన్‌జీ అయితే రూ. 2 మాత్రమే. దాంతో భ‌విష్య‌త్తులో చాలా మంది కూడా సీఎన్‌జీ వైపు చూసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం దేశంలో మారుతితో పాటు హ్యూండాయ్ మాత్ర‌మే సీఎన్‌సీ వాహ‌నాల‌ను ఉత్ప‌త్తి చేస్తుండ‌గా... ఈ మ‌ధ్య‌నే టాటా మోట‌ర్స్ కూడా ఈ సెగ్మంట్‌ లోకి ఎంట‌ర్ అయ్యింది.
Published by:Veera Babu
First published:

Tags: CNG, Suzuki

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు