Maruti లోని ఈ కార్లపై రూ.50 వేల వరకూ డిస్కౌంట్ పొందండిలా...

Maruti సంస్థ తన కార్లపై ఈ నెలలో భారీ తగ్గింపును ప్రకటించింది. ఆగస్టు నెలలో, S-Presso, Dzire, Alto 800 వంటి కార్లను చౌకగా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.

news18-telugu
Updated: August 10, 2020, 5:19 PM IST
Maruti లోని ఈ కార్లపై రూ.50 వేల వరకూ డిస్కౌంట్ పొందండిలా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరోనా లాక్ డౌన్ సమయంలో, కార్ కంపెనీల అమ్మకాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే దేశంలో అన్‌లాకింగ్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత, కంపెనీలు నష్టాన్ని పూడ్చుకోవాడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలు తమ పలు మోడళ్లకు తగ్గింపు, ప్రయోజనాలను అందిస్తున్నాయి. Maruti సంస్థ తన కార్లపై ఈ నెలలో భారీ తగ్గింపును ప్రకటించింది. ఆగస్టు నెలలో, S-Presso, Dzire, Alto 800 వంటి కార్లను చౌకగా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.

Maruti Suzuki S-Presso: డిస్కౌంట్ ₹ 50,000 వరకు

ఈ సంస్థ అతిచిన్న ఎస్‌యూవీని ఈ నెలలో రూ .50 వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేసే వీలుంది. రూ. 25 వేల నగదు తగ్గింపు, రూ .20 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ 5000 రూపాయల దాకా పొందే వీలుంది.

Maruti Alto 800: రూ. 36,000 వరకు తగ్గింపు
ఈ కారుపై కంపెనీకి 18 వేల రూపాయల నగదు తగ్గింపు, 15 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు 3 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. ఈ విధంగా, మీరు ఈ కారులో ఈ నెలలో రూ .36,000 వరకు ప్రయోజనాలు, తగ్గింపులను పొందవచ్చు.

Maruti Wagon Rపై కూడా ఈ నెలలో రూ .33 వేల తగ్గింపు లభిస్తుంది. ఇందులో నగదు తగ్గింపు, ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇక Swift, Dezireలపై కూడా ఆగస్టులో వరుసగా రూ .35,000 మరియు రూ .40,000 తగ్గింపును పొందే వీలుంది. ఇది కాకుండా, ఈ నెలలో డిస్కౌంట్ల Brezza, Ertigaను కూడా కొనుగోలు చేస్తే రూ .25 వేలు తగ్గింపు లభిస్తోంది.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading