Car Price Hike | కొత్త ఏడాది పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలని భావించే వారికి ఝలక్. కంపెనీలు వరుస పెట్టి కార్ల (Cars) ధరలను పెంచుకుంటూ వెళ్తున్నాయి. కియా, మహీంద్రా కంపెనీలు ఇప్పటికే వాటి కార్ల ధరలను రూ. లక్ష వరకు పెంచేశాయి. అయితే ఇప్పుడు వీటి సరసన మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా వచ్చి చేరింది. దీంతో మారుతీ సుజుకీ కారు కొనాలని భావించే వారిపై కూడా ప్రతికూల ప్రభావం పడనుంది.
మారుతీ సుజుకీ కార్ల ధరలు నేటి నుంచే పెరిగాయి. కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. కార్ల ధరలు 1.1 శాతం వరకు పెరుగుతాయని కంపెనీ వెల్లడించింది. కారు మోడల్, వేరియంట్ ప్రాతిపదికన కార్ల ధరల పెంపు కూడా మారుతుందని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల కార్ల ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని మారుతీ సుజుకీ పేర్కొంటోంది. అందువల్ల కొత్తగా మారుతీ కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.
షాక్‌ల మీద షాక్‌లు.. బంగారం కొనే వారికి ప్రతి రోజూ చుక్కలే, ఒకేసారి రూ.1800 పెరిగిన రేట్లు!
రెగ్యులేటరీ రూల్స్‌లో మార్పు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాల కారణంగా ఒత్తిడి నెలకొందని కంపెనీ వెల్లడించింది. కార్ల ధరలు పెరుగుతాయని మారుతీ సుజుకీ డిసెంబర్ నెలలోనే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా రేట్లు పెరిగినట్లు వెల్లడించింది. వ్యయాలను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నించామని, పాక్షికంగానే ధరల పెంపు ఉంటుందని వెల్లడించింది. తప్పని పరిస్థితుల్లో ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపింది.
యమ క్రేజ్, ఫుల్ డిమాండ్.. జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 7 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
కార్ల తయారీ కంపెనీలు గత రెండేళ్ల నుంచి కార్ల ధరలను పెంచుకుంటూనే వస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కార్ల ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని ప్రభుదాస్ లీలాధర్ రీసెర్చ్ అనలిస్ట్ మన్సీ లాల్ తెలిపారు. ఒకవైపు ధరల పెంపు, మరోవైపు వడ్డీ రేట్లు పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు వంటి అంశాలు రానున్న కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంచనా వేశారు.
ధరల పెరుగుదల వల్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్ సీ భార్గవ్ తెలిపారు. ధరల ఎంత వరకు పెరుగుతాయో కచ్చితంగా చెప్పలేమన్నారు. ఉత్పత్తి వ్యయాలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రేటు వంటివి ప్రభావం చూపుతాయని ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా చూస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమ పుంజుకుందని తెలపారు. సెమికండక్టర్ కొరత కూడా సమసిపోతుందని పేర్కొన్నారు. ఏదేమైనా కార్ల కంపెనీలు మాత్రం ధరలు పెంచుకుంటూ వెళ్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car prices, Cars, Maruti cars, MARUTI SUZUKI, Price Hike