Maruti Suzuki: మారుతి సుజుకి కస్టమర్లకు శుభవార్త.. డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా లోన్ తీసుకునే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

మారుతి సుజుకి సంస్థ ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయడానికి వీలుగా ఉండే ఆన్ లైన్ ఫైనాన్స్ ప్లాట్ ఫాంను ప్రారంభించింది. ఇది కారు కొనే ఎలాంటి పద్ధతిలో అయినా సరే ఉపయోగపడుతుంది.

  • Share this:
మారుతి సుజుకి కారు కొనాలనుకునేవారికి శుభవార్త.. తాజాగా ఆ సంస్థ ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయడానికి వీలుగా ఉండే ఆన్ లైన్ ఫైనాన్స్ ప్లాట్ ఫాంను ప్రారంభించింది. ఇది కారు కొనే ఎలాంటి పద్ధతిలో అయినా సరే ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్ ఫాం ద్వారా తమ కస్టమర్లందరూ ఫైనాన్స్ తీసుకోవచ్చని వెల్లడించింది ఆ సంస్థ. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ అనే పేరుతో ఉన్న ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే వీలుంది. ఇలాంటి సేవలు అందించే సంస్థల్లో మారుతి మొదటిది. మల్టీ ఫైనాన్సియర్, ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ కారు ఫైనాన్సింగ్ సేవలను ఈ పోర్టల్ ద్వారా అందించనుంది. తమ కార్లు కొనే వినియోగదారులకు చాలా ఎక్కువ రేంజ్‌లో ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తూ సౌకర్యాన్ని కూడా అందించాలన్నది తమ ఉద్దేశం అని ఈ సంస్థ వెల్లడిస్తోంది.
Electric Vehicles: వాయిదాలపై ఎలక్ట్రికల్‌ వాహనాలు.. ఎలాంటి డౌన్ పేమెంట్ అవసరం లేదు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
CNG Cars: పెట్రోల్ ధరల పెంపుతో సిఎన్​జి కార్ల వైపు చూస్తున్నారా? అయితే.. ఈ టాప్​ 5 కార్లను పరిశీలించండి

దీని ద్వారా మారుతి సుజుకి కస్టమర్ ఫైనాన్స్ పార్టనర్ నుంచి కస్టమర్లు తమకు సూటయ్యే అత్యుత్తమ రుణాన్ని.. ఆన్ లైన్ లోనే పొందే వీలుంటుంది. ఫైనాన్స్ కి సంబంధించిన ప్రతి ఫార్మాలిటీ మొత్తం ఆన్ లైన్ లోనే పూర్తి అవుతుంది. అంతే కాదు.. ప్రస్తుతం ఉన్న వాహనం ఎస్టిమేట్ పొందేందుకు, కో అప్లికెంట్ ఫైనాన్సింగ్ లాంటి ఎన్నో సేవలను దీని ద్వారా పొందే వీలుంటుందని చెప్పారు మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ శశాంక్ శ్రీవాత్సవ.
Tata Altroz: అదిరిపోయే లుక్​తో టాటా ఆల్ట్రోజ్ డార్క్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?

ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ ప్లాట్‌ఫాంలు మనకు ఎన్నో సౌకర్యాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు. రోజురోజుకీ మారుతున్న కస్టమర్ల అవసరాలు, వారి ఆలోచనలకు అనుగుణంగా మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ని ప్రారంభిస్తోంది. ఇది భారత్ లో అత్యుత్తమ సేవలు అందించే డిజిటల్ ప్లాట్ ఫాం. ఇది కస్టమర్లకు ప్రతి ఒక్క సేవను అందిస్తుంది. అంటూ కంపెనీ తరఫున ఇచ్చిన స్టేట్ మెంట్ లో వెల్లడించారు. అంతేకాదు.. ఇందులో ఎన్నో ఇండస్ట్రీ ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ అను చేర్చామని కూడా వెల్లడించారు.
Published by:Nikhil Kumar S
First published: