Home /News /business /

MARUTI SUZUKI BALENO RS REVIEW DRIVING IMPRESSIONS EPIC TURBO ENGINE BOOKINGS STARTS MK GH

Maruti Suzuki Baleno RS కారు అడ్వాన్స్ బుకింగ్ షురూ..జస్ట్ 11 వేలు ఉంటే చాలు...బంపర్ ఆఫర్..

Maruti Suzuki: 
(Image source: Maruti Suzuki India) ప్రతీకాత్మక చిత్రం

Maruti Suzuki: (Image source: Maruti Suzuki India) ప్రతీకాత్మక చిత్రం

మారుతి సుజుకి(Maruti Suzuki) తన హ్యాచ్‌బ్యాక్ వాహనం బాలెనో ఆర్‌ఎస్(Baleno RS) కోసం ఆన్‌లైన్ బుకింగ్‌(online booking )ను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రీమియం నెక్సా చైన్ కింద విడుదలవుతున్న ఈ వాహనాన్ని 2021 మార్చి 3న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఇంకా చదవండి ...
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి(Maruti Suzuki) తన హ్యాచ్‌బ్యాక్ వాహనం బాలెనో ఆర్‌ఎస్(Baleno RS) కోసం ఆన్‌లైన్ బుకింగ్‌(online booking )ను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రీమియం నెక్సా చైన్ కింద విడుదలవుతున్న ఈ వాహనాన్ని 2021 మార్చి 3న భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా, బాలెనో ఆర్ఎస్(Baleno RS ) కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు www.nexaexperience.com వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా, అడ్వాన్స్ బుకింగ్ కోసం కొనుగోలుదారులు ప్రాధమిక రుసుం కింద రూ.11,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ఈ వాహనాన్ని ఒకే వేరియంట్‌లో లాంచ్ చేయనున్నట్లు మారుతి సుజుకి స్పష్టం చేసింది. ఈ వాహనం 1 లీటర్ బూస్టర్‌జెట్ డైరెక్ట్ ఇంజెక్షన్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీనిలో పాదచారుల భద్రత, సైడ్ ఇంపాక్ట్, ఫ్రంటల్ ఆఫ్‌సెట్ ఇంపాక్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో సహా మరిన్ని భద్రతా లక్షణాలను చేర్చింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న బాలెనో మోడల్ రూ .5.11 లక్షల నుండి రూ .8.16 లక్షల మధ్య లభిస్తుంది. కాగా, నూతనంగా విడుదలకానున్న బాలెనో ఆర్ఎస్ వాహనం ధర బాలెనో కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మారుతి(Maruti) షేర్లు రూ. 5,998.85వద్ద ట్రేడవుతున్నాయి. బిఎస్ఈలో దీని షేర్ విలువ మునుపటి ముగింపుతో పోలిస్తే 0.59 శాతం మేర తగ్గింది.

car sales june 2020, maruti suzuki june sales 2020, maruti suzuki sales news, car sales news, auto sales june 2020, june car sales 2020, మారుతి సుజుకీ విక్రయాలు 2020, జూన్ లో కార్ల విక్రయాలు, ఆటో జూన్ విక్రయాలు, కార్ల విక్రయాలు జూన్
Maruti Ignis వినియోగదారుల ఆఫర్ రూ.25,000 , ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.15,000 , కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6000, మొత్తం బెనిఫిట్ రూ. 46,000 (ప్రతీకాత్మక చిత్రం)


నవంబర్లో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన బాలెనో మోడల్..

కాగా, పెరుగుతున్న ఇన్పుట్ తయారీ ఖర్చులపై ప్రభావం తగ్గించడానికి 2021 జనవరి నుంచి తమ కంపెనీకి చెందిన వివిధ మోడళ్ల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజికి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కంపెనీ తన మొత్తం అమ్మకాల్లో 1.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సుజుకి 2020 నవంబర్లో 1,53,223 యూనిట్ల వాహనాలను విక్రయించగా, 2019 నవంబర్లో 1,50,630 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల రీత్యా ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో గత నెలలో మారుతీ సుజుకి బాలెనో మోడల్ అగ్రస్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ వాహనం ఒక్క నవంబర్ నెలలోనే 17,872 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
Published by:Krishna Adithya
First published:

Tags: Business, CAR, Cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు