Home /News /business /

MARUTI SUZUKI ANNOUNCED PRICE HIKE ON ITS ALL MODELS FROM JANUARY HERE FULL DETAILS NS

Maruti Suzuki Cars Price Hike: మారుతీ కారు ఇక మరింత కాస్ట్లీ.. భారీగా పెరగనున్న ధరలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారుతీ కార్ల (Maruti Cars) ధరలు ఇక మరింతగా పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి (January 2022) నుంచి తన అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కీలక ప్రకటన చేసింది. కొత్త కారు కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరిలో కార్ల ధరను (Cars Price Hike) మరో సారి పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ కంపెనీకి చెందిన అన్ని మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తయారీకి వినియోగించే అన్ని రకాల ముడి సరుకు ధరలు పెరగడంతో కార్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ తెలిపింది. అయితే ధరల పెరుగుదల ఏ మేరకు ఉంటుందనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. అయితే అన్ని మోడళ్లకు ధరల పెరుగుదల ఒకే విధంగా ఉండదని తెలుస్తోంది. ధరల పెరుగుదలపై మారుతి సుజుకీ ఇండియా (MSI) స్పందిస్తూ.. గతేడాది కాలంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో కంపెనీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటుందని తెలిపింది.

    దీంతో కస్టమర్లపై భారం మోపక తప్పడం లేదని వెల్లడించింది. జనవరి నుంచి ఈ ధరల పెరుగుదల అమలులోకి వస్తుందని తెలిపింది. వేర్వేరు మోడళ్లకు వేర్వేరుగా ధరల పెరుగుదల ఉండే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. కంపెనీ కార్ల ధరలు ఆల్టో నుంచి SUV S-Cross మోడళ్ల వరకు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు కంపెనీ తన కార్ల ధరను పెంచింది.
    Electric Cars: పాత కార్లను ఎలక్ట్రిక్‌గా మార్చడం ఎలా? అందుకు ఎంత ఖర్చవుతుంది? పూర్తి వివరాలు

    జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్ లో 1.6 శాతం, సెప్టెంబర్ లో 1.9 శాతం పెంచింది. అంటే.. మొత్తం 4.9 శాతం పెంచింది. PTIతో MSI సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్ తో పాటు ఇతర విలువైన లోహాల వంటి వస్తువుల ధరలు గత కొంతకాలంగా పెరగడంతో ధరల పెంపుపై కంపెనీపై ఒత్తిడి పెరిగిందన్నారు.
    Upcoming Cars In India: మార్కెట్లో అతి త్వరలో విడుదల కానున్న కార్లు ఇవే...

    గత ఏడాది నుంచి కంపెనీ ఒత్తిడిలో ఉందన్నారు. అయితే, మార్కెట్‌లో డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున భారీ ధరల పెంపును నివారించామని శ్రీవాస్తవ చెప్పారు. “ముడి సరుకుల ధరలు ఎక్కువగా ఉండడం నేపథ్యంలో దిద్దుబాటు చర్యల కోసం ధరల పెరుగుదల తప్పా తమకు వేరే మార్గం లేకుండా పోయింది. ఈ సంవత్సరం మేము మొత్తంగా 4.9 శాతం ధరలను పెంచాం. ముడి సరుకుల ధర పెంపుతో పోల్చితే.. మేము పెంచుతున్న ధరలు చాలా తక్కువ’’ అని ఆయన అన్నారు. కంపెనీకి, వినియోగదారులపై భారం మోపడం ఇష్టం లేదని, కానీ.. ధరలు పెంచడం తప్పా తమకు వేరే మార్గం లేదని శ్రీవాస్తవ అన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CAR, Cars, MARUTI SUZUKI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు