Home /News /business /

MARUTI SUZUKI ALTO K10 IS LAUNCHING TOMORROW IN THE INDIAN MARKET KNOW EVERYTHING ABOUT THE HATCH AHEAD OF THE LAUNCH GH SRD

Maruti Suzuki Alto K10 : ఇండియాలో మారుతి సుజుకి ‘2022 ఆల్టో K10’ కారు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Maruti Suzuki Alto K10

Maruti Suzuki Alto K10

Maruti Suzuki Alto K10 : మారుతి సుజుకి కంపెనీ 2022 ఆల్టో K10 (Alto K10) కారును భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్లతో పాటు ఇతర వివరాలు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
మారుతి సుజుకి కంపెనీ 2022 ఆల్టో K10 (Alto K10) కారును భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. 2012లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మోడల్.. దాదాపు ఒక దశాబ్దం తర్వాత హ్యాచ్‌బ్యాక్ బిగ్‌ అప్‌డేట్‌లతో సరికొత్తగా వినియోగదారుల ముందుకు వచ్చింది. దీని ధర, స్పెసిఫికేషన్లతో పాటు ఇతర ప్రత్యేకతలు తెలుసుకుందాం.

* డిజైన్
2022 ఆల్టో K10 డిజైన్, ఇంతకు ముందు వచ్చిన సెలెరియోను పోలి ఉంటుంది. స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్‌లు కొత్తగా డిజైన్ చేశారు. ఫ్రంట్ ఫాసియా భారీ గ్రిల్‌తో వస్తుంది. అయితే దీనికి అల్లాయ్ వీల్స్‌ను అందించడం లేదు. కొనుగోలుదారులు క్యాప్‌లతో కూడిన స్టీల్ వీల్స్‌తో సంతృప్తి చెందాల్సి ఉంటుంది.

అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉండవు. వెనుక భాగంలో స్క్వేర్‌షేప్‌ టెయిల్-ల్యాంప్ క్లస్టర్, రీవ్యాంప్డ్ బంపర్ ఉన్నాయి. 2022 మారుతి సుజుకి ఆల్టో K10 కారు సాలిడ్ వైట్, గ్రానైట్ గ్రే, సిల్కీ వైట్, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దీని పొడవు, ఎత్తు కూడా పెరిగింది.


* ఫీచర్లు
హ్యాచ్‌బ్యాక్ కొత్త వెర్షన్ ఫీచర్ల పరంగా భిన్నంగా ఉంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోలు, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్‌ చేయగల ORVMలు, రిమోట్ కీ వంటి ఫీచర్లు ఈ కారు సొంతం. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్టెడ్ 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంది. సెక్యూరిటీ ఫీచర్‌ల పరంగా.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబీఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌నీ), రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

* ఇంజిన్
కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో 1.0L K10C DualJet పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 66 bhp పవర్ అవుట్‌పుట్, 89 Nm అత్యధిక టార్క్‌ను అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది, అయితే 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షనల్‌గా ఉంటుంది.

* వేరియంట్‌లు, బుకింగ్‌లు
2022 ఆల్టో K10 కారు LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు గ్రేడ్‌లలో అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి అరేనా అవుట్‌లెట్‌లలో రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ఇదివరకే ప్రారంభమయ్యాయి. రూ.11,000 చెల్లించి అధికారిక కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. కొత్త తరం ఆల్టో K10 ధరలు రూ.3.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. వేరియంట్‌ను బట్టి ధరలు రూ.6 లక్షల వరకు ఉన్నాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Cars, MARUTI SUZUKI, New model cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు