దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ Maruti సుజుకి నవంబర్ నెలలో అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, నవంబర్లో కంపెనీ అమ్మకాలు 1.53 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. కాగా గత నెలలో కంపెనీ 1.50 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. అదే సమయంలో, సాలీనా ప్రాతిపదికన మొత్తం అమ్మకాలు 1.7 శాతం పెరిగి 1.53 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది నవంబర్ లో 1.51 లక్షల కార్ల అమ్మకాలను నమోదు చేశరు. గత ఏడాదితో పోల్చితే Maruti మొత్తం దేశీయ అమ్మకాలు 0.4 శాతం పెరిగాయి. దేశీయ అమ్మకాలు 1.44 లక్షల యూనిట్లుగా నమోదు అయ్యాయి. గతేడాది దేశీయ అమ్మకాలు 1.43 లక్షల యూనిట్లు ఉన్నాయి. గత ఏడాది నవంబర్లో 6,944 యూనిట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన Maruti ఎగుమతులు 29.7 శాతం పెరిగి 9,004 యూనిట్లకు చేరుకున్నాయి.
గణాంకాలను పరిశీలిస్తే –Maruti మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశీయ మార్కెట్లో అమ్మకాలు నవంబర్లో స్వల్పంగా 1,44,219 యూనిట్లకు పెరిగాయి.. నవంబర్ 2019 లో ఇది దేశీయ మార్కెట్లో 1,43,686 వాహనాలను విక్రయించింది.
మినీ కార్-ఆల్టో, ఎస్-ప్రీసో అమ్మకాలు ఏడాది క్రితం ఇదే నెలలో 26,306 యూనిట్ల నుంచి 15.1 శాతం తగ్గి 22,339 యూనిట్లకు చేరుకున్నాయి.
కాంపాక్ట్ సెగ్మెంట్ - అదేవిధంగా, కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్ అమ్మకాలు 1.8 శాతం తగ్గి 76,630 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 78,013 యూనిట్లు.
అయితే, మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు 29.1 శాతం పెరిగి 2019 నవంబర్లో 1,448 యూనిట్ల నుంచి 1,870 యూనిట్లకు చేరుకున్నాయి.
యుటిలిటీ వెహికల్-విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా అమ్మకాలు ఏడాది క్రితం ఇదే నెలలో 23,204 యూనిట్ల నుంచి 2.4 శాతం పెరిగి 23,753 యూనిట్లకు చేరుకున్నాయి.ఎగుమతులు - కంపెనీ ఎగుమతులు నవంబర్లో 29.7 శాతం పెరిగి 9,004 యూనిట్లకు చేరుకున్నాయి. నవంబర్ 2019 లో కంపెనీ 6,944 వాహనాలను ఎగుమతి చేసింది.
Maruti సుజుకి తన వినియోగదారుల కోసం Maruti సుజుకి 'సబ్స్' సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో ఈ సేవ కొన్ని నగరాల్లో మాత్రమే ఉండేది, ఇది ఇప్పుడు ముంబై, చెన్నై, అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ వరకు విస్తరించింది. ఇంతకుముందు service ఢిల్లీ ఎన్సిఆర్ (ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ మరియు గురుగ్రామ్), బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణేలలో ఈ సేవ ప్రారంభించబడింది, వీటిని ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది.