హోమ్ /వార్తలు /బిజినెస్ /

Maruti Car offers: మారుతి పండుగ ఆఫర్.. ఈ కొత్త మోడల్‌పై ఏకంగా రూ.40,000 కంటే ఎక్కువ డిస్కౌంట్..

Maruti Car offers: మారుతి పండుగ ఆఫర్.. ఈ కొత్త మోడల్‌పై ఏకంగా రూ.40,000 కంటే ఎక్కువ డిస్కౌంట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తన కొత్త ఆల్టో కె10 (Alto K10) కారుపై అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించింది. నిజానికి ఈ కారును ఆగస్టు నెలలోనే లాంచ్ చేశారు. అయితే దీన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఫెస్టివల్ సీజన్ కంటే మంచి సమయం దొరకదు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

భారతదేశంలో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కొనసాగుతోంది. దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పర్వదినాల సందర్భంగా ఇంటికి కొత్త కార్లను తీసుకొచ్చేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు కార్ల తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తన కొత్త ఆల్టో కె10 (Alto K10) కారుపై అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించింది. నిజానికి ఈ కారును ఆగస్టు నెలలోనే లాంచ్ చేశారు. అయితే దీన్ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఫెస్టివల్ సీజన్ కంటే మంచి సమయం దొరకదు.

ఆల్టో కె10 ఎంట్రీ లెవల్ కారుగా ఇండియాలో లాంచ్ అయ్యింది. సెప్టెంబర్‌లో ఆల్టో 800, ఆల్టో K10 కలిసి 24,844 యూనిట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఆ నెలలో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్‌గా ఇవి నిలిచాయి. కాగా కంపెనీ పండుగ వేళ Alto K10పై రూ.40,100 వరకు ఆఫర్లు తీసుకొచ్చింది. ఆల్టో K10 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT), ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) అనే రెండు వేరియంట్లపై కూడా రూ.40,100 వరకు కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.20,000 అప్‌ఫ్రంట్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, రూ.5,100 కార్పొరేట్ లేదా రూరల్ వంటి డిస్కౌంట్స్‌ ఉన్నాయి.

Aston Martin DBX707: ఇండియాలో లగ్జరీ కారు ‘ఆస్టన్ మార్టిన్ DBX707’ లాంచ్.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..

వేరియంట్ల వారీగా ధరలు

కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 1.0-లీటర్, డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT, పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 66.62 PS పవర్, 89 NM టార్క్ ఆఫర్ చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMTతో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆల్టో K10 Std, Lxi, Vxi, Vxi+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Std MT ధర రూ.3.99 లక్షలు.. Lxi MT ధర రూ.4.82 లక్షలు.. Vxi MT ధర రూ.4.99 లక్షలు.. Vxi AMT ధర రూ. 5.49 లక్షలు.. Vxi+ MT ధర రూ.5.33 లక్షలు.. Vxi+ AMT ధర రూ.5.83 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇవన్నీ ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలుగా గమనించాలి. సెప్టెంబర్‌తో పోల్చితే, అక్టోబర్‌లో ఆల్టో కె10పై డిస్కౌంట్ పెరిగింది. గత నెలలో, MT వేరియంట్‌పై మొత్తం 25,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంది. అదే AMT వేరియంట్‌కు 15,000 వరకు డిస్కౌంట్ లభించింది.

స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలు

ఆల్టో K10 MT వేరియంట్‌కి 24.39kmpl, AMT వేరియంట్‌ 24.90kmpl మైలేజ్ అందిస్తుంది. ఈ కారులో 7-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, USB, బ్లూటూత్, Aux కేబుల్‌ సపోర్టు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBS), రివర్స్ పార్కింగ్ సెన్సార్, ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిట్ ఫ్రంట్ సీట్ బెల్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్‌తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఉపయోగకర ఫీచర్లు ఉన్నాయి.

First published:

Tags: CAR, Maruti cars

ఉత్తమ కథలు