Home /News /business /

MARUTI CARS SELLING CHEAP ONLY CHANCE TILL 31ST JANUARY MK

Maruti Suzuki Cars Discount: మారుతి ఆల్టో 800 కారుపై రూ.33000 వరకూ డిస్కౌంట్..జనవరి 31 వరకే అవకాశం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా ఈ నెల నుంచే ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కార్ల కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, మారుతి సుజుకి ఈ నెలలో తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. మారుతీకి చెందిన ఏ కారుకు ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
    భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా ఈ నెల నుంచే ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కార్ల కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు, మారుతి సుజుకి ఈ నెలలో తన కార్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. మారుతీకి చెందిన ఏ కారుకు ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకుందాం.

    మారుతీ ఆల్టో 800 (Maruti Alto 800)

    మారుతి సుజుకి ఆల్టో 800 జనవరి 2022లో మొత్తం రూ. 33,000 బెనిఫిట్స్ ప్రకటించింది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు ,  రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3000 కార్పొరేట్ తగ్గింపు ఇందులో ఉన్నాయి. అయితే ఈ తగ్గింపు CNG వేరియంట్‌పై లేదని గమనించాలి.

    మారుతీ సుజుకి S-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

    ఈ కారు  పెట్రోల్, CNG వేరియంట్‌లపై రూ. 33,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. వీటిలో రూ. 15,000 నగదు తగ్గింపు (పెట్రోల్ వేరియంట్ కు మాత్రమే), రూ. 15,000 (పెట్రోల్ వేరియంట్ కు మాత్రమే) ఎక్స్ఛేంజ్ బోనస్ ,  రూ. 3000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

    మారుతి ఈకో (Maruti Eeco)

    మారుతీ ఈకోపై మొత్తం రూ. 23,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. వీటిలో రూ. 10,000 నగదు తగ్గింపు (పెట్రోల్ వేరియంట్ కు మాత్రమే), రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ (పెట్రోల్ వేరియంట్ కు మాత్రమే) ,  రూ. 3000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి.

    మారుతీ వ్యాగన్ ఆర్ (Maruti Wagon R)

    వ్యాగన్ R పై రూ. 23,000 వరకూ బెనిఫిట్స్ పొందే వీలుంది. ఈ బెనిఫిట్స్ మీకు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ,  కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో పొందే వీలుంది. రూ. 10,000 (పెట్రోల్ వేరియంట్ కు మాత్రమే) నగదు తగ్గింపు అందుబాటులో ఉంది. కారుపై రూ. 10,000 (పెట్రోల్ వేరియంట్ కు మాత్రమే) ఎక్స్ఛేంజ్ బోనస్ ,  రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది.

    ఇతర కార్లపై తగ్గింపు ఆఫర్లను తెలుసుకోండి

    జనవరి 2022లో మారుతి సెలెరియోపై రూ. 13,000 తగ్గింపు ఆఫర్ ఉంది. ఇందులో రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ,  రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ ,  అన్ని వేరియంట్లలో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ ,  రూ. 3000 కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. మారుతి డిజైర్ అన్ని వేరియంట్లపై రూ. 10,000 నగదు తగ్గింపు ,  రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. ఈ కారుపై 3000 రూపాయల కార్పొరేట్ తగ్గింపు కూడా ఇవ్వబడుతోంది. మారుతి విటారా బ్రెజ్జాపై రూ. 18,000 బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.5000 క్యాష్ డిస్కౌంట్,  రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. ఈ కారుపై 3000 రూపాయల కార్పొరేట్ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. మారుతి ఎర్టిగా BS6 పెట్రోల్ ,  CNG మోడళ్లపై ఎలాంటి తగ్గింపు లేదు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Cars, MARUTI SUZUKI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు