అవసరం లేని వస్తువులు కొని ఆ తర్వాత అనవసరంగా కొన్నామని మీరెప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇలాంటి అనుభవాలు అందరికీ మామూలే. వినియోగదారులు వస్తువులు కొనేలా, తమ సేవల్ని వినియోగించేలా మార్కెటర్లు ఉపయోగించే 29 సైకలాజికల్ ట్రిక్స్, టాక్టిక్స్‌ను అమెరికాకు చెందిన టైటిల్మ్యాక్స్ అనే సంస్థ బయటపెట్టింది. ఈ ట్రిక్స్‌తో మిమ్మల్ని సులువుగా బుట్టలో పడేసుకొని మీరు వస్తువులు కొనేలా చేయడం వారికి చాలా సింపుల్. అసలు ఆ ట్రిక్స్, టాక్టిక్స్ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో, మీపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి. ఏ వస్తువు కొనాలన్నా ముందుగా ధర చూడటం మామూలే. ఉదాహరణకు మీరు ఏదైనా షాపుకెళ్లి మీకు కావాల్సిన వస్తువు చూస్తారు. ధర రూ.1,999 ఉంటే అందులో కామా తీసేసి రూ.1999 అని రాస్తారు. కామా తీసెయ్యడం వల్ల ధర ఏమీ మారదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కామా తీసేస్తే ఆ ప్రభావం వినియోగదారులపై ఉంటుందని తేలింది. ఇక తక్కువ అనే పదాన్ని వాడేందుకు మార్కెటర్లు ఆసక్తి చూపిస్తారు. ఉదాహరణకు 'హై పర్ఫామెన్స్' అని ప్రమోషన్ చేయడం కన్నా 'లో మెయింటనెన్స్' అని ప్రచారం చేస్తుంటారు. ఓ వస్తువు ధర రూ.999 అనుకుందాం. దాని బదులు రూ.1,000 అని పెట్టొచ్చు కదా అని మీకు అనుమానం రావొచ్చు. కానీ అక్కడే ఉంది మతలబు. నాలుగు అంకెల కన్నా మూడు అంకెలు తక్కువ. తేడా ఒక రూపాయే అయినా చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తుంది.
Smartphone Under Rs 10,000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు లేటెస్ట్ మోడల్స్ ఇవే
e-PAN Card Download: పాన్ కార్డు ఇంకా రాలేదా? ఇ-పాన్ సింపుల్‌గా డౌన్లోడ్ చేయండిలా
అంతేకాదు వస్తువుల ధరల్ని కూడా రౌండ్ ఫిగర్ కాకుండా రూ.257, రూ361 ఇలా నిర్ణయిస్తారు. దీన్నే ఆడ్ ఈవెన్ ప్రైసింగ్ అంటారు. ఇక ఏదైనా వస్తువు ధర తగ్గించినప్పుడు యాడ్ ఎలా ఉంటుందో గమనించారా? ఓ వస్తువు ధరను రూ.6,999 నుంచి రూ.5,999 ధరకు తగ్గించారనుకుందాం. రూ.6,999 నెంబర్‌ను పెద్దగా, రూ.5,999 చిన్నగా రాయడం మనం చూస్తూనే ఉంటాం. భారీగా తగ్గించారని కస్టమర్లు అనుకునేలా ఇలా డిజైన్ చేస్తారు. ఇక రూ.1,000 వస్తువుపై రూ.200 డిస్కౌంట్ ప్రకటిస్తే రూ.200 తగ్గింపు అని రాయడం కన్నా 20% తగ్గింపు అని రాస్తారు. ఇక షాపింగ్ చేసే పురుషులను అట్రాక్ట్ చేయడానికి ధరల్ని ఎరుపు రంగులో రాస్తారు. ఇతర రంగుల్లో ధరల్ని రాయడం కన్నా ఎరుపు రంగుల్లో ధరల్ని రాస్తే పురుషులు ఎక్కువగా కొన్నట్టు అధ్యయనంలో తేలింది.
మీరు ఏదైనా షాపింగ్ మాల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్తే అక్కడ మనసుకు హత్తుకునే సంగీతం లో వాల్యూమ్‌లో వినిపించిందా? అంతా ప్రశాంతంగా, హాయిగా ఉన్నట్టు భావించారా? ఇదంతా మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఉపయోగించే టెక్నిక్. మీరు కొనాలనుకునే వస్తువు అప్పటికే ఇతరులు ఎవరైనా కొని, ఉపయోగించి, దానిపై మంచి అభిప్రాయం చెప్పారంటే మీరు కూడా ఆ వస్తువు కొనాలని అనుకుంటారు. ఇది సహజం. అందుకే రివ్యూస్, టెస్టిమోనియల్స్ అడ్వర్టైజింగ్లో ఓ భాగం. దీన్నే సోషల్ ప్రూఫ్ అంటారు. ఇక రెస్టారెంట్లలో మెనూలోని కొన్ని ఆహార పదార్థాలకు కావాలని ధర ఎక్కువగా పెడతారు. ధరల్ని పోల్చి కాస్త తక్కువ ధరలో ఉన్న ఐటెమ్స్ ఆర్డర్ చేయాలనుకునే కస్టమర్ల కోసం ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తారు.
Realme Narzo 20A: తక్కువ ధరలో ఫోన్ కావాలా? కాసేపట్లో రియల్మీ నార్జో 20ఏ సేల్
Motorola E7 Plus: ఈరోజే మోటోరోలా ఈ7 ప్లస్ సేల్... యాక్సిస్, ఐసీఐసీఐ కార్డులపై ఆఫర్స్
ఒక వస్తువు ధర రూ.100 అనుకుందాం. అలా డైరెక్ట్‌గా అమ్మితే కొనేవాళ్లు తక్కువ. అదే వస్తువు ధరను రూ.200 చేసి బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ అని ప్రచారం చేస్తే కొనేవాళ్లు ఎక్కువ. దీని వల్ల ఒక వస్తువు బదులు ఏకంగా రెండు వస్తువుల్ని అమ్మేస్తారు. లేదా రూ.200 ధర పెట్టి 50% డిస్కౌంట్ అని అట్రాక్ట్ చేస్తారు. ఇక ఓ కస్టమర్ ఏవైనా స్నాక్స్ కొనాలనుకున్నారు. 100 గ్రాముల ధర రూ.20 ఉంటుంది. 150 గ్రాముల ధర రూ.30 ఉంటుంది. 250 గ్రాముల ధర రూ.35 ఉంటుంది. అప్పుడు కస్టమర్ ఎలా ఆలోచిస్తాడు. 100 గ్రాములకు రూ.20 కాబట్టి 200 గ్రాములకు రూ.40 కావాలి. కానీ రూ.35 ధరకే 250 గ్రాములు వస్తోంది కదా అనుకుంటాడు. దీన్నే డెకాయ్ ప్రైసింగ్ అంటారు.
ఇలా కస్టమర్లు ఎక్కువ కొనేలా చేయడానికి, ఎక్కువ ఖర్చు చేయడానికి మార్కెటర్లు 29 రకాల సైకలాజికల్ ట్రిక్స్, టాక్టిక్స్ ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన టైటిల్మ్యాక్స్ తేల్చింది. మీరు ఎలా మోసపోయే అవకాశం ఉందో తెలిసింది కాబట్టి ఇకపై షాపింగ్ చేసేప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Online business, Online shopping