Home /News /business /

MARKET VOLATILITY STABLE MARKET VOLATILITY THESE ARE THE THINGS THAT MUTUAL FUND INVESTORS SHOULD PAY TO ATTENTION GH VB

Market Volatility: స్టాక్ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు కొంత కాలంగా ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి.

ఆదిల్ శెట్టి, CEO, BANKBAZAAR.com

ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో(Stock Market) ట్రేడింగ్(Trading) చేసే ఇన్వెస్టర్లు(Investors) కొంత కాలంగా ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం(Inflation), వడ్డీ రేట్ల పెంపు, రూపాయి విలువ పతనం, GDP తగ్గుదల, విదేశీ పెట్టుబడిదారుల లిక్విడేషన్, ఉక్రెయిన్-రష్యా యుద్ధం(Ukraine-Russia War) వంటి అనేక కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితి కొత్త ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. మ్యూచువల్ ఫండ్(Mutual Fund) ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ ఇప్పటికే 10% పైగా క్షీణించిందని నివేదికలు చెబుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని షాక్‌లు ఎదురవ్వొచ్చు. కానీ అస్థిరతతో నిండిన బేర్, బుల్ సైకిల్స్‌ మార్కెట్‌లో అంతర్లీనంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని బేసిక్స్‌కు కట్టుబడి ఉండటంతో పాటు హెల్దీ ఫైనాన్షియల్ బిహేవియర్ ఫాలో అవ్వడం అనేవి పెట్టుబడిదారులకు సహాయపడతాయి.

మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే, మీరు తెలుసుకోవాల్సిన, చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

* మార్కెట్ అస్థిరతను (Markets Volatility) అర్థం చేసుకోండి
స్టాక్ మార్కెట్లలో అస్థిరత (Volatility) అనేది సహజం. కొన్నిసార్లు ఇది మితంగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అస్థిరత మరీ కిందకు పడిపోవడాన్ని కరెక్షన్ అంటారు. అయితే ఏ సమయంలోనైనా 2-5% కరెక్షన్ సాధారణం. ఏదైనా పెట్టుబడి వ్యూహం దీనికి కారకంగా ఉండవచ్చు. ఇది 10% మించితే.. పరిస్థితిని చక్కదిద్దే వ్యూహాల గురించి ఆలోచించవచ్చు. లోతైన దిద్దుబాట్లు బలమైన బౌన్స్-బ్యాక్‌లకు దోహదం చేస్తాయి.

2000లో డాట్ కామ్ బస్ట్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ, 2009లో లెమాన్ సంక్షోభం తర్వాత చెప్పుకోదగ్గ బౌన్స్-బ్యాక్, మిడ్, స్మాల్-క్యాప్ సెగ్మెంట్లలో స్తబ్దత తర్వాత 2017-18లో మలుపు, కోవిడ్ తర్వాత తాజా బుల్ ర్యాలీ వంటివి మనం చూశాం. ఇవన్నీ గత రెండు దశాబ్దాలుగా జరిగిన కొన్ని సంఘటనలు. ఇలాంటి పరిస్థితులకు భయాందోళన చెందకుండా పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు సంపన్నులుగా మారారు. తక్కువ వాల్యుటేషన్స్ కొనుగోలు చేయడానికి రిస్క్ తీసుకున్న పెట్టుబడిదారులు సంపన్నులయ్యారు.

* ఈక్విటీలలో పెట్టుబడి పెట్టాలా లేదా?
స్టాక్స్ అత్యంత రిస్క్ అసెట్ క్లాస్‌లలో ఒకటిగా ఉండవచ్చు. కానీ దీర్ఘకాలంలో చాలా రివార్డ్‌గా కూడా ఉంటాయి. సాధారణంగా ఈక్విటీలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కనీసం 3 నుంచి 5 సంవత్సరాల వరకు టచ్ చేయకూడదు. ఈక్విటీ ఎక్స్పోజర్ మీ రిస్క్ తీసుకునే తత్వం (risk appetite), వయసుపై ఆధారపడి ఉండాలి. పెట్టుబడి పెట్టడం అనేది మీరు మార్కెట్‌లో ఎక్కువ సమయాన్ని వెచ్చించేలా చేసే శాశ్వత ప్రక్రియ. ప్రస్తుతం పెట్టుబడులను ఆపడం పరిష్కారం కాకపోవచ్చు. ఈక్విటీలలోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వ్యూహాత్మకంగా నిర్వహించడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన పని. ఉదాహరణకు, 40 సంవత్సరాల వరకు వయసు ఉండే పెట్టుబడిదారులు తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో కనీసం 70% ఈక్విటీని ఉంచుకోవచ్చు; 40-55 మధ్య ఉన్నవారు రిస్క్ ప్రొఫైల్‌పై ఆధారపడి 30-60% తక్కువ ఈక్విటీ కేటాయింపును పరిగణించవచ్చు. 55 ఏళ్లు పైబడిన వారు పదవీ విరమణకు సమీపిస్తున్నందున తక్కువ కేటాయింపులను ఎంచుకోవచ్చు.

Explained: గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. ప్రస్తుతం ఎగుమతులను ఎందుకు నిషేధించింది..?


* SIPలు ఆపకూడదు
క్రమానుగత పెట్టుబడులైన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌(SIP)ను ఇన్వెస్టర్లు ఆపకపోవడం మంచిది. తక్కువ ధరల వద్ద సేకరించిన యూనిట్లు దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తాయి. SIP అనేది మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటు లాంటిది. మంచి అలవాట్లను నిలిపివేస్తే, వాటిని తిరిగి ప్రారంభించడం చాలా కష్టం. ఫలితంగా దీర్ఘకాలంలో భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.

* డబ్బు అవసరం లేకుంటే రిడీమ్ చేయవద్దు
మీకు నిజంగా డబ్బు అవసరమైనప్పుడు లేదా మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు తప్ప, మీ పెట్టుబడిని రిడీమ్ చేసుకోవడం తెలివైన పని కాదు. కేవలం మార్కెట్ పరిస్థితుల కారణంగా దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. పెట్టుబడి పెట్టండి. మీ లక్ష్యం ఒక సంవత్సరంలోపు చేరుకుంటే లేదా మీకు నిజంగా నిధులు అవసరమైతే, పాక్షికంగా ఫండ్స్ రిడీమ్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

* అదనపు కొనుగోళ్లు చేయండి
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి మీ ప్రస్తుత పెట్టుబడులకు అదనపు కొనుగోళ్లను జోడించే అవకాశాలను అందిస్తుంది. మీవద్ద మిగులు నిధులు ఉంటే.. అదనపు కొనుగోళ్ల ద్వారా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. ఇది పెట్టుబడుల ఖర్చును యావరేజింగ్ చేయడంలో సహాయపడుతుంది. కాంపౌండ్ బెనిఫిట్స్ పెంచే మరిన్ని యూనిట్లను మీకు అందజేస్తుంది.

* సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (STP) ఉపయోగం
STP అనేది పెట్టుబడికి సమర్థవంతమైన మార్గం. మీరు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ఈ టూల్‌ను ఉపయోగించవచ్చు. ఈక్విటీలలోకి మీ పెట్టుబడులు అస్థిరంగా ఉంటే, పరిస్థితిని సర్ధుబాటు చేయవచ్చు. ఉదాహరణకు మీ క్యాష్‌ను లిక్విడ్ ఫండ్‌లో ఉంచడం, లో-రిస్క్ స్కీమ్ నుంచి నెమ్మదిగా ఈక్విటీలకు బదిలీ చేయడం ద్వారా సంపదను క్రమపద్ధతిలో సృష్టించవచ్చు.

* బ్యాలెన్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ అప్రోచ్
ఈక్విటీ, డెట్‌ స్కీమ్స్‌తో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇందుకు హైబ్రిడ్ ఫండ్స్, డైనమిక్ అసెట్ ఫండ్స్ ఎంచుకోవచ్చు. ఈ వ్యూహం మీ రిస్క్ ఎక్స్‌పోజర్‌ను పరిమితంగా ఉంచుతుంది. అనేక అసెట్ క్లాస్‌లలోకి డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం ద్వారా రిస్క్-అడ్జస్ట్‌డ్ రిటర్న్‌ అందిస్తుంది.

* పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు
చాలా మంది ఇన్వెస్టర్ల వద్ద పెట్టుబడి పెట్టడానికి మిగులు నిధులు ఉండవచ్చు. అయితే ఇది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కాదు. ఏకమొత్తం (lump-sum) కొనుగోళ్లు చేయకండి. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా, ఎక్కువ విడతల్లో చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయండి. క్రమంగా పెట్టుబడులను పొడిగించుకుంటూ వెళ్లండి.

* అస్థిరతను ఉపయోగించండి
మార్కెట్ అస్థిరత అనేది సంపద సృష్టించడానికి ఒక మంచి అవకాశం. లీనియర్ మార్కెట్‌లో సంపద సృష్టించడం అనేది జరగదు. మార్కెట్‌లో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు చేసే కొనుగోళ్లు సంపద సృష్టికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతకు భయపడకండి. మంచి రాబడుల కోసం ఈ పరిస్థితిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోండి.
Published by:Veera Babu
First published:

Tags: Mutual Funds, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు