భారీ నష్టాల నుంచి వారాంతంలో స్వల్పంగా కోలుకున్నాయి. నిఫ్టీ ప్రారంభం నుంచే లాభాల్లో ట్రేడవుతుండగా, 8300 పాయింట్ల ఎగువన ట్రేడవుతోంది. అలాగే సెన్సెక్స్ కూడా 180 పాయింట్లు లాభపడి. 28400 పాయింట్లు ఎగువన ట్రేడవుతోంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం నష్టాల్లోకి జారుకుంది. 2.63 శాతం మేర బ్యాంక్ నిఫ్టీ నష్టాలు నమోదు చేసింది. అటు ఐటీ స్టాక్స్ కాస్త ఊరట ఇస్తున్నాయి నిఫ్టీ ఐటీ సూచీ 5 శాతం మేర లాభపడింది. టాప్ గెయినర్ గా GAIL,ONGC, Wipro, Infosys, Tech Mahindra స్టాక్స్ నిలిచాయి. ఇక టాప్ లూజర్లుగా IndusInd Bank, Yes Bank, HDFC Bank ,Titan Company, ICICI Bank స్టాక్స్ నిలిచాయి.
రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ పాజిటివ్ కాంట్రిబ్యూటర్స్ గా నిలిచాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Stock Market