స్టాక్ మార్కెట్లలో సోమవారం భారీ పతనం కనిపించింది. మార్కెట్లు మరోసారి కరోనా దెబ్బకు కుదేలు అయ్యాయి. సెన్సెక్స్ 2400 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా ఏకంగా 668 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ సైతం ఏకంగా 1813 పాయింట్లు నష్టపోయింది. ఆల్ టైం భారీ ఇంట్రాడే నష్టాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా SBI, HDFC, Relaince, HDFC BANK, ICICI Bank లాంటి స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అటు నిఫ్టీలో టాప్ లూజర్లుగా IndusInd Bank,JSW Steel, Adani Ports, Tata Steel, HDFC నిలిచాయి. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో నిఫ్టీ ఇప్పటికే ఇంట్రాడేలో 9000 పాయింట్ల దిగువకు పతనమవగా, సెన్సెక్స్ కూడా 30 వేల పాయింట్ల పతనం దిశగా కదులుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Stock Market