MARKET LIVE NIFTY BELOW 8200 SENSEX FALLS 300 PTS PHARMA STOCKS IN FOCUS MK
Stock Markets: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఆరంభ లాభాలు ఆవిరి...
Stock Market: ఇన్వెస్టర్లకు భారీ షాక్...
(ప్రతీకాత్మక చిత్రం)
సెన్సెక్స్ 28వేల స్ఠాయిని, నిఫ్టీ 8150 స్థాయి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ షేర్లు బలహీనంగా న్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఓపెనింగ్ లో కాస్త లాభపడినా వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 363 పాయింట్లు క్షీణించి 27901 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు నష్టంతో 8149 వద్ద కొనసాగుతోంది. దీంతోసెన్సెక్స్ 28వేల స్ఠాయిని, నిఫ్టీ 8150 స్థాయి దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ షేర్లు బలహీనంగా న్నాయి. అటు సిప్లా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, గెయిల్,ఐటీసీ జీ ఎంటర్ టైన్ మెంట్ లాభపడుతున్నాయి. కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, హీరో మోటో, టైటన్, ఆసియన్ పెయింట్స్, బీపీసీఎల్,ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్ గా ఉన్నాయి మార్చి నెలలో అమ్మకాలు పడిపోవడంతో బజాజ్ ఆటో, టాటా మోటార్స్ అశోక్ లేలాండ్, మారుతి లాంటి షేర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. ప్రారంభంలోనే 48 పైసలు కోల్పోయి 76.08 వద్ద కొనసాగుతోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.