హోమ్ /వార్తలు /బిజినెస్ /

స్టాక్ మార్కెట్ లో లాభాల రన్...అమెరికా ప్యాకేజీతో ఊరట...

స్టాక్ మార్కెట్ లో లాభాల రన్...అమెరికా ప్యాకేజీతో ఊరట...

స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్

కొనుగోళ్ల జోరుతో ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 29600 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ 8600 స్థాయిని దాటేసింది.

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా మూడో సెషన్ లో కూడా కీలక సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసిన సెన్సెక్స్ 29600 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ 8600 స్థాయిని దాటేసింది. ప్రస్తుతం మార్కెట్లో మధ్యాహ్నాం 12 గంటలకు నిఫ్టీ సూచీ 8702 పాయింట్ల వద్ద 384 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మరోవైపు సెన్సెక్స్ కూడా 29988 పాయింట్ల వద్ద 1452 పాయింట్లు లాభపడి ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 9 శాతం లాభపడి సూచీలను ముందుండి నడిపిస్తోంది. ICICI Bank, HDFC Bank, SBI, HDFC స్టాక్స్ సూచీలకు బలాన్ని ఇస్తున్నాయి. టాప్ గెయినర్లుగా IndusInd Bank, Axis Bank, ICICI Bank, HDFC, Bajaj Finserv నిలిచాయి. ఇదిలా ఉంటే అమెరికా ప్రభుత్వం కరోనా నియంత్రణకు 150 లక్షల కోట్ల  భారీ ప్యాకేజీ ప్రకటించింది. దీనికి సెనేట్ నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఆశించడంతో యూఎస్ అలాగే, ఆసియా మార్కెట్లలో జవసత్వాలు వచ్చాయి.

First published:

Tags: Business, Stock Market

ఉత్తమ కథలు