Home /News /business /

MARKET LIVE INDICES OFF DAYS LOW NIFTY ABOVE 10850 SENSEX FALLS 420 POINTS MK

Stock Market: స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు...150 పాయింట్ల నష్టపోయిన నిఫ్టీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 152 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోయింది. సెక్టార్ల పరంగా చూసినట్లయితే, నిఫ్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 2 శాతం నష్టపోయింది.

    స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 152 పాయింట్లు నష్టపోగా, సెన్సెక్స్ 450 పాయింట్లు నష్టపోయింది. సెక్టార్ల పరంగా చూసినట్లయితే, నిఫ్టీ బ్యాంక్ సూచీ ఏకంగా 2 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఎనర్జీ సూచీ ఏకంగా 2.45 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టీ మెటల్స్ సూచీ కూడా 2 శాతం నష్టపోయింది. అలాగే ఫార్మా, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్‌ఫ్రా స్టాక్స్ కూడా భారీగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్లుగా భారతీ ఎయిర్ టెల్ +2.45 శాతం, కోల్ ఇండియా +1.93 శాతం, టీసీఎస్ +1.77 శాతం, టెక్ మహీంద్రా +1.52 శాతం, హింద్ పెట్రోల్ +1.44 శాతం లాభపడ్డాయి. ఇక ఎస్ బ్యాంక్ -7.25 శాతం నష్టపోగా, టాటామోటార్స్ -4.71 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ -4.51 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ -4.32 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ -3.66 శాతం నష్టపోయి టాప్ లూజర్లుగా నిలిచాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సూచీలు వెనుకంజ వేయడంతో పాటు, మొదటి త్రైమాసికంలో కార్పోరేట్ లాభాలు డీలా పడటం, అలాగే జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులు మార్కెట్లో సెంటిమెంటును దెబ్బ తీసినట్లు మార్కెట్ వర్గాల చెబుతున్నాయి.
    First published:

    Tags: Business, BUSINESS NEWS, Nifty, Sensex, Stock Market

    తదుపరి వార్తలు