Home /News /business /

MARKET CLOSE INDIAN INDICES AS SENSEX AND NIFTY REGISTERED A BIGGEST SINGLE SESSION GAIN IN THE LAST 10 YEARS MK

Stock Market: నిర్మలా ఎఫెక్ట్...ఒకే రోజు రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Stock Market: శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,921.15 పాయింట్లు లాభపడి 38,014.62 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 569.40 పాయింట్లు లాభపడి 11,274.20 పాయింట్ల వద్ద ముగిసింది.

Stock Market:  మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థకు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో, దేశీయ బెంచ్ మార్క్ సూచీలు దూసుకెళ్లాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,921.15 పాయింట్లు లాభపడి 38,014.62 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ సైతం 569.40 పాయింట్లు లాభపడి 11,274.20 పాయింట్ల వద్ద ముగిసింది. గడిచిన పదేళ్లలో నిఫ్టీ ఈ తరహాలో సింగిల్ సెషన్ లో లాభాలు పొందలేదు. మార్కెట్లు ఈ స్థాయిలో పుంజుకోవడంతో ఒకే సెషన్ లో మదుపరులు రూ.6 లక్షల కోట్లు వెనకేసుకున్నారు. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఐషర్ మోటార్స్ +13.38 శాతం, హీరో మోటో +13.06 శాతం, ఇండస్ ఇండ్ +10.71 శాతం, హింద్ పెట్రోల్+10.46 %, అల్ట్రాటెక్ సిమెంట్ +10.43 % లాభపడ్డాయి. సెక్టార్ పరంగా చూస్తే బ్యాంకింగ్ సెక్టార్ దూసుకెళ్లింది. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ 2223 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా ఆర్ బీఎల్ బ్యాంక్ ఏకంగా 15.31 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్ 7.99 శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 8.95 శాతం లాభఫడింది.

ఇదిలా ఉంటే ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 2 వేల పాయింట్లు ఎగిసింది. ముఖ్యంగా కార్పోరేట్ టాక్స్ 25 శాతం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ప్రకటించిన ఉద్దీపన కంపెనీలకు ఊరటనిచ్చింది. ఇప్పటికే మాంద్యం దెబ్బకు ఆటో, నిర్మాణ, తయారీ రంగాలు కుదేలవుతున్న తరుణంలో కేంద్రం మార్కెట్లను తన ఉద్దీపన చర్యలతో మార్కెట్లను ఆదుకునే ప్రయత్నం చేసింది.
Published by:Krishna Adithya
First published:

Tags: Nifty, Sensex, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు