బడ్జెట్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలు...రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి...

కంపెనీల్లో ప్రమోటర్ల వాటా తగ్గించమిన సెబీకి సిఫార్సు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఫలితంగా సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ -792.82 పాయింట్లు నష్టపోయి 38,720.57 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ -252.55 (-2.14%) పాయింట్లు నష్టపోయి 11,558.60 పాయింట్ల వద్ద నెగిటివ్ గా ముగిసింది.

news18-telugu
Updated: July 8, 2019, 4:47 PM IST
బడ్జెట్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలు...రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కేంద్ర బడ్జెట్ పై మదుపరులు పెదవి విరిచారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినప్పటి రోజే బేర్ మన్న సూచీలు, సోమవారం మరింత బలహీనపడ్డాయి. ముఖ్యంగా కంపెనీల్లో ప్రమోటర్ల వాటా తగ్గించమిన సెబీకి సిఫార్సు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఈక్విటీ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ఫలితంగా సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ -792.82 పాయింట్లు నష్టపోయి 38,720.57 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ -252.55 (-2.14%) పాయింట్లు నష్టపోయి 11,558.60 పాయింట్ల వద్ద నెగిటివ్ గా ముగిసింది. మరో కీలక సూచీ బ్యాంక్ నిఫ్టీ 872 పాయింట్లు పతనమై 30603 పాయింట్ల వద్ద ముగిసింది.అటు దేశీయ పరిస్థితులతో పాటు ఆసియా మార్కెట్లలో సైతం అమ్మకాల ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో స్టాక్ సూచీలు బేర్ మన్నాయి. సూచీల పతనం దెబ్బకు గత రెండు సెషన్లలో ఇన్వెస్టర్లకు చెందిన రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరైంది. జూలై 4, బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ Rs. 153.58 లక్షల కోట్లు ఉండగా, జూలై 8న మార్కెట్ క్యాప్ Rs 148.08 కోట్లకు పతనమైంది.

ఇదిలా ఉంటే సెక్టార్ పరంగా చూసినట్లయితే అన్ని సెక్టార్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రధానంగా నిఫ్టీ ఆటో సూచీ -3.26 శాతం నష్టపోగా, నిఫ్టీ రియాలిటీ సూచీ -3.49 శాతం నష్టపోయింది. అలాగే నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సూచీ అత్యధికంగా -3.78 శాతం నష్టపోయింది. ఇక ఐటీ, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా, మెటల్స్ సూచీలు దాదాపు 2 శాతం చొప్పున నష్టపోవడం గమనార్హం.

టాప్ లూజర్స్ విషయానికి వస్తే బజాజ్ ఫిన్‌సర్వ్ -9.99శాతం నష్టపోగా, బజాజ్ ఫైనాన్స్ -8.22 శాతం నష్టపోయింది. అదే బాటలో ఓఎ‌న్‌జీసీ -5.63 శాతం, ఐఓసీ -5.35 శాతం, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ -5.27 శాతం చొప్పున నష్టపోయాయి. అలాగే నిఫ్టీ సూచీని నష్టపరిచిన నెగిటివ్ కంట్రిబ్యూషన్స్ లో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, లార్సెన్, ఐవోసీ, ఐసీఐసీఐ బ్యాంక్ పెద్ద మొత్తంలో ఉన్నాయి.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...