మూడో రోజూ తగ్గిన ఇంధన ధరలు

వరుసగా మూడో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...ముందు ముందు మరింత దిగిరావచ్చన్న అంచనాలు వాహనదారులకు ఉపసమనం కలిగిస్తున్నాయి.

Janardhan V | news18
Updated: June 1, 2018, 6:06 AM IST
మూడో రోజూ తగ్గిన ఇంధన ధరలు
నమూనా చిత్రం (PTI)
  • News18
  • Last Updated: June 1, 2018, 6:06 AM IST
  • Share this:
Marginal Reduction in Fuel Prices for 3rd Straight Day
Representative image (PTI)


వరుసగా మూడో రోజు పెట్రో ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోల్‌పై 6 పైసలు, డీజిల్‌పై 5 పైసలు తగ్గించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.78.29గా ఉండగా..డీజిల్ రూ.69.20గా ఉంది. ముందు ముందు ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వాహనదారులకు ఊరట కలిగిస్తున్నాయి.

బుధవారంనాడు లీటరు పెట్రోల్, డీజిల్‌పై కేవలం 1 పైసాను ఆయిల్ కంపెనీలు తగ్గించడంపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. బుధవారంనాటి నుంచి లీటరు పెట్రోల్‌పై 14 పైసలు తగ్గగా...డీజిల్ 10 పైసలు తగ్గింది. దీంతో వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరల వడ్డన నుంచి వాహనదారులకు కాస్త ఊరట కలుగుతోంది. 16 రోజుల్లో లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.3.80 పైరగ్గా...లీటరు డీజిల్‌పై రూ.3.38 పెంచారు.

బుధవారంనాడు పెట్రోల్, డీజిల్ ధరను ఆయిల్ కంపెనీలు కేవలం 1 పైసా తగ్గించగా...కేరళా ప్రభుత్వం లీటరుపై రూ.1 తగ్గించి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేలా కేరళా ప్రభుత్వం మరో రూ.1 తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరలను తగ్గించే దిశగా కేంద్రాన్ని ప్రేరేపించే ఉద్దేశంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గిస్తున్నట్లు కేరళా సీఎం పినరయి విజయన్ మంత్రివర్గ సమావేశంలో తెలిపారు.

ఇంధన ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలు స్థిరీకరణ అయినట్లు గత మూడు రోజుల ట్రెండ్స్‌ను పరిశీలిస్తే అవగతం అవుతోందన్నారు. గత వారం 80 డాలర్లుగా ఉన్న బ్యారల్ క్రూడాయిల్ ధర...ప్రస్తుతం 75-76 డాలర్లకు దిగివచ్చినట్లు వివరించారు. అయితే ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు మరింత పెరగకుండా...కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందన్న విషయంపై మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన హామీ ఏదీ రావడం లేదు.
Published by: Janardhan V
First published: June 1, 2018, 6:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading