హోమ్ /వార్తలు /బిజినెస్ /

March Deadlines: మార్చిలో ఈ 5 డెడ్‌లైన్స్ గుర్తుంచుకోండి... లేకపోతే చిక్కులే

March Deadlines: మార్చిలో ఈ 5 డెడ్‌లైన్స్ గుర్తుంచుకోండి... లేకపోతే చిక్కులే

March Deadlines: మార్చిలో ఈ 5 డెడ్‌లైన్స్ గుర్తుంచుకోండి... లేకపోతే చిక్కులే
(ప్రతీకాత్మక చిత్రం)

March Deadlines: మార్చిలో ఈ 5 డెడ్‌లైన్స్ గుర్తుంచుకోండి... లేకపోతే చిక్కులే (ప్రతీకాత్మక చిత్రం)

March Deadlines | ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిపేవారు మార్చిలో తప్పనిసరిగా ఈ 5 డెడ్‌లైన్స్ గుర్తుంచుకోవాలి. లేకపోతే చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వ్యాపారాలు చేసేవారికి, ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి మార్చి చాలా ముఖ్యమైన నెల. అనేక ఆర్థిక అంశాలకు సంబంధించి మార్చిలోనే డెడ్‌లైన్స్ (March Deadlines) ఉంటాయి. మార్చి నెల ఇప్పటికే ప్రారంభమైంది. కాబట్టి ఈ ముఖ్యమైన డెడ్‌లైన్స్ గుర్తుంచుకోకపోతే ఇబ్బందులు తప్పవు. పాన్ ఆధార్ లింకింగ్ (PAN-Aadhaar Linking), అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్, ఐటీఆర్ ఫైలింగ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన (Pradhan Mantri Vaya Vandana Yojana) పథకం లాంటి అనేక అంశాలకు సంబంధించి ఈ నెలలోనే డెడ్‌లైన్స్ ఉన్నాయి. మరి వాటిలో మీరు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఏంటీ? మార్చి 31 లోపు ఏం చేయాలి? తెలుసుకోండి.

PAN-Aadhaar Linking: ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే పాన్ కార్డ్ , ఆధార్ నెంబర్ లింకింగ్ కోసం అనేకసార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 31 తో ముగిసిన గడువును రూ.1,000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు కూడా ముగియబోతోంది. అప్పట్లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డులు చెల్లవు.

PAN-Aadhaar Link: పాన్ ఆధార్ లింకింగ్ వీరికి తప్పనిసరి కాదు... మినహాయింపు రూల్స్ ఇవే

Advance tax payment: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ చెల్లించడానికి 2023 మార్చి 15 వరకే అవకాశం ఉంది. ఇది చివరి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్. దీంతో పన్ను చెల్లింపుదారులు 100 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్టవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 208 ప్రకారం, సంవత్సరానికి అంచనా వేసిన పన్ను రూ.10,000 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టైతే ముందస్తు పన్ను రూపంలో ఆ ట్యాక్స్‌ను ముందుగానే చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది జీతం కాకుండా ఇతర ఆదాయ వనరులను కలిగి ఉన్న వ్యక్తులు చెల్లించాల్సిన పన్ను. అద్దె, షేర్లపై వచ్చిన లాభాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లాటరీల ద్వారా వచ్చిన మొత్తానికి వర్తిస్తుంది.

ITR: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. FY19-20 కోసం ఫైల్ చేయడం మానేసిన లేదా ఏదైనా ఆదాయాన్ని నివేదించని పన్ను చెల్లింపుదారులు నవీకరించబడిన ITR లేదా ITR-Uని ఫైల్ చేయవచ్చు. 2022 ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ఎక్కువ వ్యవధిని అనుమతించడానికి అప్‌డేటెడ్ రిటర్న్స్ విధానాన్ని తీసుకొచ్చింది ఆదాయపు పన్ను శాఖ. కొన్ని షరతులకు లోబడి అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన 24 నెలలలోపు అప్‌డేట్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు.

CIBIL Score: గూగుల్ పే యాప్ ఉందా? సింపుల్‌గా సిబిల్ స్కోర్ చెక్ చేయండిలా

Pradhan Mantri Vaya Vandana Yojana: కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ. 60 ఏళ్లు దాటినవారు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి 7.4 వార్షిక వడ్డీ పొందవచ్చు. 10 ఏళ్ల పాటు ఇదే వడ్డీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.

Tax Saving: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేయాలనుకుంటే 2023 మార్చి 31 లోగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పాత పన్ను విధానం ఎంచుకునేవారికి ఇది వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద పలు రకాల పెట్టుబడులు పెట్టి రూ.1,50,000 వరకు మినహాయింపులు పొందవచ్చు.

First published:

Tags: Income tax, ITR Filing, PAN card, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు