Home /News /business /

MANY COMPANIES GIVING OFFERS ON RAKSHA BANDHAN 2021 EVK

ర‌క్షాబంధ‌న్‌కు ఆక‌ట్టుకుంటున్న ఆఫ‌ర్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అన్నా చెల్ల‌ల అనుబంధ‌నాకి ప్ర‌తీక‌గా ర‌క్షాబంధ‌న్ పండుగ జ‌రుపుకొంటారు. ఈ రోజు చెల్లు రాఖీ క‌డితే అన్న‌య్య చెల్లెలికి బ‌హుమ‌తి ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ఈ నేప‌థ్యంలో ప‌లు మొబైల్ కంపెనీలు ఎన్నో ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. చాలా ఉత్ప‌త్తులు త‌మ ధ‌ర‌ల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    అన్నా చెల్ల‌ల అనుబంధ‌నాకి ప్ర‌తీక‌గా ర‌క్షాబంధ‌న్ పండుగ జ‌రుపుకొంటారు. ఈ రోజు చెల్లు రాఖీ క‌డితే అన్న‌య్య చెల్లెలికి బ‌హుమ‌తి ఇవ్వ‌డం ఆన‌వాయితీ. ఈ నేప‌థ్యంలో ప‌లు మొబైల్ కంపెనీలు ఎన్నో ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. చాలా ఉత్ప‌త్తులు త‌మ ధ‌ర‌ల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్ అయిన మొబైల్ ఫొన్‌ల‌లో చాల బ్రాండ్‌లు రూ.15,000 లోపు ఎన్నో ఫీచ‌ర్ ఫోన్‌ల‌ను అందుబాటులో ఉంచాయి. ర‌క్షాబంధ‌న్ రోజున వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ఈ కామ‌ర్స్ ప్లాట్ ఫామ్‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులు కూడా మొబైల్ ఫోన్‌ల‌పై డిస్కౌంట్ల‌ను అందిస్తున్నాయి.
    చాలా కంపెనీలు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారుల‌ను దృష్టిలో పెట్టుకొని ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. త‌క్కువ ధ‌ర‌కు మంచి కెమెరా.. బ్య‌ట‌రీ, డిజైన్ క‌లిగిన ఫోన్‌ల‌పై ఆఫ‌ర్లు ఇస్తూ వినియోగ‌దారులను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.
    అంతే కాకుండా ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్ పోస్ట్ డీహెచ్ఎల్ గ్రూప్ (డీపీడీహెచ్‌ఎల్‌)లో భాగమైన బ్లూ డార్ట్ తన రాఖీ ఎక్స్‌ప్రెస్ ఆఫర్‌ని ప్రారంభించింది. ప్రత్యేక తగ్గింపు ధర రూ.200కే కోవిడ్ -19 యోధులకు రాఖీ షిప్‌మెంట్ పంపడానికి లేదా స్వీకరించడానికి ఈ ఆఫర్ అవకాశం కల్పిస్తుంది. ఎవ‌రికైనా రాఖీ పంపాల‌నుకొనే క‌స్ట‌మ‌ర్ల‌కు అర‌కిలో బ‌రువు ఉన్న షిప్‌మెంట్‌ల‌పూ రూ.250 వ‌ర‌కు ప్ర‌త్యేక త‌గ్గింపు ఇస్తున్నారు. విదేశాల్లో నివ‌సిస్తున్న వారికి పంపితే ప్ర‌తీ షిప్‌మెంట్ మీద దాదాపు 50శాతం రాయితీతో పంపంవ‌చ్చు. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 23 వ‌ర‌కు ఉంది.
    ఇవే కాకుండా ఎస్‌బీఐ కూడా రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎస్‌బీఏ యోనో యాప్ ద్వారా ‘ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌’ బ‌హుమ‌తులు కొనుగోల చేస్తే దాదాపుగా 20 శాతం రాయితీని అందిస్తోంది. అధికంగా రూ.999 వ‌ర‌కు రాయితీ పొందవ‌చ్చు ఈ ఆఫ‌ర్ రాఖీ పౌర్ణ‌మి రోజు వ‌ర‌కు అంటే ఆగ‌స్టు 22 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.
    అంతే కాకుండా గిఫ్టింగ్ పోర్ట‌ల్ ఐజీపీ.కామ్ కూడా ర‌క్షాబంధ‌న్‌కు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిది. వారి పోర్ట‌ల్‌లో ఎస్‌బీఐ ద్వారా చెల్లింపులు చేసి ఏదైనా వ‌స్తువులు కొనుగోలు చేస్తే 70శాతం వ‌ర‌కు రాయితీ అందించ‌నున్నారు. ఈ ఆఫ‌ర్ కూడా ఆగ‌స్టు 22 వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Amazon Great Indian Festival Sale

    తదుపరి వార్తలు