హోమ్ /వార్తలు /బిజినెస్ /

OPD Coverage: మణిపాల్‌సిగ్నా కొత్త హెల్త్ పాలసీ లాంచ్.. ఫీచర్లు, ప్రయోజనాల వివరాలివే..!

OPD Coverage: మణిపాల్‌సిగ్నా కొత్త హెల్త్ పాలసీ లాంచ్.. ఫీచర్లు, ప్రయోజనాల వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ అనే ఒక క్యాష్‌లెస్ అవుట్‌ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) కవరేజ్‌ని లాంచ్ చేసింది. ఈ హెల్త్ పాలసీ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, ప్రీస్క్రైబ్డ్‌ రోగనిర్ధారణ పరీక్షలు (Diagnostic Tests).. ఫార్మసీ వంటి డైలీ అయ్యే హెల్త్ కేర్ ఖర్చులను కవర్ చేస్తుంది.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం పేలవమైన జీవనశైలి వల్ల చాలామంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే వైద్య ఖర్చులు (Medical Expenses) రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రోగులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వీరిని ఆదుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు సరికొత్త ఆరోగ్య బీమా పథకాలు తీసుకొస్తున్నాయి. తాజాగా మణిపాల్‌సిగ్నా (ManipalCigna) హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ (ManipalCigna ProHealth Prime) అనే ఒక క్యాష్‌లెస్ అవుట్‌ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) కవరేజ్‌ని లాంచ్ చేసింది. ఈ హెల్త్ పాలసీ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, ప్రీస్క్రైబ్డ్‌ రోగనిర్ధారణ పరీక్షలు (Diagnostic Tests).. ఫార్మసీ వంటి డైలీ అయ్యే హెల్త్ కేర్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ పాలసీ కవరేజ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం సుమారు 65 శాతం వైద్య చికిత్స ఖర్చులను రోగులు తమ జేబులు నుంచే పెడుతున్నారు. ఈ వైద్య ఖర్చులను ప్రస్తుతం ఇన్సూరెన్స్ మార్కెట్‌లోని చాలా ఆరోగ్య బీమా పాలసీలు కవర్ చేయడం లేదు. అందువల్ల, ఈ ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ అనే క్యాష్‌లెస్ ఓపీడీ కవరేజీని తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. ఈ పాలసీ హోల్డర్‌లు ప్రతి సంవత్సరం రూ.20,000, రూ.30,000 లేదా రూ.50,000 పొందేలా ఆప్షన్స్ ఎంపిక చేసుకోవచ్చు. డెంటల్, విజన్, ఫిజికల్ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, ప్రీస్క్రైబ్డ్‌ మెడిసిన్స్ మొదలైన వాటితో సహా అన్ని ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.


మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ బెనిఫిట్స్

మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ ఇతర ఆరోగ్య బీమా పాలసీల కంటే భిన్నమైన ఓపీడీ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది.

- మొదటి ఏడాది నుంచే యాన్యువల్ హెల్త్ చెకప్.

- డాక్టర్ కన్సల్టేషన్: 6 వేల కంటే ఎక్కువ డాక్టర్లు.. 16కి మించి మేజర్ కన్సల్టేషన్ స్పెషాలిటీస్.. హాస్పిటల్, క్లినిక్ బేస్డ్ నెట్‌వర్క్.

- అన్ని మేజర్ ల్యాబ్ టెస్ట్స్ కోసం 20 కంటే ఎక్కువ చైన్‌లు, సెంటర్స్‌లో అయ్యే డయాగ్నస్టిక్ ఖర్చులు.

- 2890 నగరాల్లో 27,105 పిన్-కోడ్‌లలో 1.60 లక్షలకు మించి మెడిసిన్ ఐటమ్స్‌కు అయ్యే ఫార్మసీ ఖర్చులు.. 570కి పైగా నగరాల్లో స్టోర్ పికప్స్‌కి కవరేజీ.

- ఈ ప్లాన్ 10 వేలకు పైగా డాక్టర్లతో 16 ప్రముఖ భారతీయ భాషల్లో 24X7 అన్‌లిమిటెడ్ టెలి కన్సల్టేషన్‌లను ఆఫర్ చేస్తుంది.

- డైలీ స్టెప్ కౌంట్‌ అచీవ్ చేయడం ద్వారా రెన్యువల్ ప్రీమియంపై 20 శాతం వరకు రివార్డ్ పాయింట్లు

- లిస్టు చేసిన 36 క్రిటికల్ ఇల్‌నెస్‌ల కోసం డొమెస్టిక్ సెకండ్ ఒపీనియన్

- కండిషన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌తో పాటు ప్రీస్క్రైబ్డ్‌ మందులు, ల్యాబ్ టెస్ట్స్ హెల్త్ సప్లిమెంట్లపై డిస్కౌంట్లు పొందవచ్చు.

ఈ ఓపీడీ బెనిఫిట్స్ పొందేందుకు, పాలసీదారులు తమకు లేదా తమ ఆధారపడిన వారి కోసం మణిపాల్‌సిగ్నా యాప్‌లో క్యాష్‌లెస్ సర్వీసెస్ బుక్ చేసుకోవాలి. ఈ పాలసీ బేస్ ప్రీమియంలో 20 శాతం వరకు రివార్డ్ పాయింట్‌లను అందిస్తుండగా.. ఈ రివార్డ్ పాయింట్లను రెన్యువల్ ప్రీమియంపై డిస్కౌంట్ కోసం వాడుకోవచ్చు. ఈ కవరేజి గురించి మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రసూన్ సిక్దర్ మాట్లాడుతూ... మణిపాల్‌సిగ్నా ప్రోహెల్త్ ప్రైమ్ కింద కేవలం సింగిల్ క్లిక్‌తో రోగులకు బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు. క్యాష్‌లెస్ ఓపీడీ కవర్ ప్రత్యేకించి అధిక ఖర్చులు ఉన్న వారికి లేదా చిన్న పిల్లలతో మెడిసిన్ ఎక్కువగా కొనుగోలు చేసే తల్లిదండ్రులకు లేదా చాలా తరచుగా పరీక్షలు చేయించుకునే రోగులకు బాగా హెల్ప్ అవుతుందని ఆయన పేర్కొన్నారు.

First published:

Tags: Health benefits, Health Insurance, Insurance, Life Insurance

ఉత్తమ కథలు